Home

»

Latest News

అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ స్టైలిష్ యాక్ష‌న్ డ్రామా!?

Jan 25, 2022 11:51AM

`పుష్ప - ద రైజ్`తో పాన్ - ఇండియా స్టార్ అయిపోయారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్వ‌ర‌లో `పుష్ప‌` సెకండ్ పార్ట్ `పుష్ప - ద రూల్` షూటింగ్ లో పాల్గొన‌బోతున్నారాయ‌న‌. త్వ‌రిత‌గ‌తిన చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకోనున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. సంవ‌త్స‌రాంతంలో తెర‌పైకి రానుంది.

ఇదిలా ఉంటే.. `పుష్ప - ద రూల్` త‌రువాత మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో బ‌న్నీ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నార‌ని, పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ క్రేజీ వెంచ‌ర్ తెర‌కెక్క‌నుంద‌ని బ‌జ్. కాగా, బోయ‌పాటితో పాటు మ‌రో స్టార్ కెప్టెన్ కి కూడా బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `రాజా రాణి`, `పోలీస్`, `అదిరింది`, `విజిల్` వంటి అనువాదాల‌తో తెలుగువారికి చేరువైన కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీతో అల్లు అర్జున్ ఓ సినిమా చేయ‌నున్నార‌ట‌. స్టైలిష్ యాక్ష‌న్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. పాన్ - ఇండియా ఫిల్మ్ గా తెర‌కెక్క‌నుంద‌ట‌. త్వ‌ర‌లోనే బ‌న్నీ - అట్లీ కాంబో మూవీపై క్లారిటీ రానున్న‌ది. అన్న‌ట్టు..  ప్ర‌స్తుతం బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తో ఓ హిందీ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు అట్లీ.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com