Home

»

Latest News

యాక్ష‌న్ తో మొద‌లుపెట్ట‌నున్న బాల‌య్య‌!?

Jan 25, 2022 4:42PM

రీసెంట్ గా రిలీజైన `అఖండ‌`తో కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ అందుకున్నారు న‌ట‌సింహం నందమూరి బాల‌కృష్ణ‌. కేవ‌లం థియేట‌ర్స్ లోనే కాదు ఓటీటీలోనూ ఈ డివోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామా.. సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ఇదిలా ఉంటే.. `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో బాల‌య్య ఓ శ‌క్తిమంత‌మైన చిత్రం చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. ఫిబ్ర‌వ‌రి 12 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జ‌రుపుకోనుంద‌ట‌. తొలి షెడ్యూల్ లో భాగంగా.. బాల‌య్య అండ్ కోపై ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ ని డిజైన్ చేశార‌ట గోపీచంద్. హై వోల్టేజ్ తో సాగే ఈ ఫైట్ ఎపిసోడ్.. సినిమా హైలైట్స్ లో ఒక‌టిగా నిలుస్తుంద‌ని బ‌జ్. ఆపై క‌డ‌ప ప‌రిస‌ర ప్రాంతాల్లో ఓ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంతేకాదు.. చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి ఈ ఏడాది ద‌స‌రాకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి.. త‌న మార్క్ యాక్ష‌న్ తో బాల‌య్య మ‌రోసారి బాక్సాఫీస్ ని షేక్ చేస్తారేమో చూడాలి.

Also Read: అనిల్ రావిపూడి.. మ‌రో స‌మ్మ‌ర్ హిట్ క్రెడిట్ అయ్యేనా!?

కాగా, ఇందులో బాల‌కృష్ణ‌కి జంట‌గా శ్రుతి హాస‌న్ న‌టించ‌నుండ‌గా వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నుంది. `అఖండ‌` అనంత‌రం యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్.. బాల‌య్య కాంబోలో మ‌రోసారి ఈ బ‌డా ప్రాజెక్ట్ కి స్వ‌రాలు స‌మ‌కూర్చ‌నున్నాడు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com