ప్రభాస్, కీరవాణి.. మరోసారి!?
on Mar 8, 2022

డార్లింగ్ ప్రభాస్, స్వరవాణి కీరవాణిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన `ఛత్రపతి` (2005), `బాహుబలి - ది బిగినింగ్` (2015), `బాహుబలి - ది కంక్లూజన్` (2017) చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించాయి. వీరిని హ్యాట్రిక్ కాంబోగా నిలిపాయి. కట్ చేస్తే.. త్వరలో ఈ ఇరువురి కలయికలో మరో సినిమా రాబోతోందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో `మాస్టర్` బ్యూటీ మాళవికా మోహనన్ ఓ నాయికగా నటించనుందని సమాచారం. కాగా, ఈ సినిమాకి కీరవాణి బాణీలు అందించే అవకాశముందని వినిపిస్తోంది. అదే గనుక నిజమైతే.. ప్రభాస్, కీరవాణి కాంబినేషన్ లో వచ్చే నాలుగో చిత్రమిదే అవుతుంది. మరి.. జట్టుకట్టిన ప్రతీసారి హిట్టుకొడుతున్న ప్రభాస్, కీరవాణి ద్వయం.. నెక్స్ట్ వెంచర్ తోనూ అదే బాట పడుతారేమో చూడాలి.
Also Read: 'రాధేశ్యామ్'తో పోటీ పడటం చాలా థ్రిల్‌గా ఉంది!
ఇదిలా ఉంటే, ప్రభాస్ తాజా చిత్రం `రాధే శ్యామ్` మార్చి 11న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన `ఆర్ ఆర్ ఆర్` మార్చి 25న తెరపైకి రాబోతోంది. ఈ రెండు సినిమాలు కూడా పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ గానే ఎంటర్టైన్ చేయనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



