పూజ వద్దనుకుంటే.. రష్మిక ముద్దనుకుందా!?
on Mar 8, 2022

కొద్ది రోజుల క్రితం ఓ బాలీవుడ్ మూవీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతుందంటూ ప్రచారం జరిగింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇప్పుడదే పాటలో పూజ బదులు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చిందులేయనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. `అర్జున్ రెడ్డి`, `కబీర్ సింగ్` వంటి సంచలన విజయాల అనంతరం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా `యానిమల్` పేరుతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. రణ్ బీర్ కపూర్, పరిణీతి చోప్రా జోడీగా నటిస్తున్న ఈ హిందీ చిత్రంలో సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మనిషి జంతువులా ప్రవర్తిస్తే ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయి? అనే పాయింట్ తో `యానిమల్` రూపొందుతోంది. కాగా, ఈ సినిమా కోసం ఆ మధ్య పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయనుందంటూ వార్తలొచ్చాయి. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఇప్పుడదే పాటలో రష్మిక నర్తించే అవకాశముందంటున్నారు. సో.. పూజ వద్దనుకున్న పాటని రష్మిక ముద్దనుకుందన్నమాట. త్వరలోనే `యానిమల్`లో రష్మిక స్పెషల్ డాన్స్ నంబర్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. కెరీర్ లో తొలిసారిగా చేయనున్న ఈ ప్రత్యేక గీతంతో రష్మిక ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇదిలా ఉంటే, రష్మిక కథానాయికగా నటించిన హిందీ సినిమాలు `మిషన్ మజ్ను`, `గుడ్ బై` విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



