అఖండ` ఊపులో బాలయ్య.. `బ్యాక్ టు బ్యాక్ హిట్స్` కూడా కొట్టేస్తారా!
on Dec 19, 2021

నటసింహం నందమూరి బాలకృష్ణకి వరుస విజయాలు కొత్తేమీ కాదు. ఒకే ఏడాది (1986)లో డబుల్ హ్యాట్రిక్ కొట్టి బాక్సాఫీస్ బొనాంజా అనిపించుకున్న సంచలన చరిత్ర బాలయ్య సొంతం. అయితే, తన కెరీర్ లో `బంగారు బుల్లోడు` (1993), `భైరవ ద్వీపం` (1994)తోనే చివరిసారిగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూశారు ఈ నందమూరి హ్యాండ్సమ్ హీరో. ఆపై `బొబ్బిలి సింహం`(1994), `వంశానికొక్కడు`(1996), `పెద్దన్నయ్య`(1997), `సమరసింహారెడ్డి`(1999), `నరసింహనాయుడు`(2001), `లక్ష్మీ నరసింహా`(2004), `సింహా`(2010), `లెజెండ్`(2014), `గౌతమీపుత్ర శాతకర్ణి`(2017), `జై సింహా`(2018) వంటి విజయాలు వచ్చినా.. ఆయా చిత్రాల తరువాత వెంటనే రిలీజైన సినిమాలేవీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి.
Also Read:కలెక్షన్లలో నంబర్ వన్ ఇండియన్ మూవీగా 'పుష్ప'.. తగ్గేదే లే!
ఈ నేపథ్యంలో.. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మళ్ళీ ఎప్పుడు కొడతారా? అని నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా `అఖండ`తో సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకున్న బాలకృష్ణ.. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. జనవరి నుంచి పట్టాలెక్కనున్న ఈ చిత్రం కూడా బాలయ్య శైలికి తగ్గట్టుగా శక్తిమంతమైన కథతో తెరకెక్కనుంది. `అఖండ`తో బాలయ్య, `క్రాక్`తో గోపీచంద్ సక్సెస్ రూట్ లో ఉన్న వైనం.. వీరి కాంబోలో రాబోయే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. అంచనాలకు తగ్గట్టే సినిమా కూడా ఉంటే.. `అఖండ`, `ఎన్ బి కే 107`తో బాలయ్య దాదాపు 28 ఏళ్ళ తరువాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకోవడం ఖాయం. అదే విధంగా, అభిమానుల చిరకాల ముచ్చట కూడా నెరవేరుతుంది. చూద్దాం.. ఏం జరుగుతుందో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



