గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంతో `బీస్ట్`!
on Dec 20, 2021

దాదాపు పదేళ్ళ తరువాత బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన తమిళ చిత్రం `బీస్ట్`. కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాని `డాక్టర్` ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా, గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంతో ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ తెరకెక్కిందని టాక్.
ఇదిలా ఉంటే.. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అనిరుధ్ స్వరకల్పనలో తమిళ యువ కథానాయకుడు శివ కార్తికేయన్ రచించిన ఈ గీతాన్ని చిత్ర కథానాయకుడు విజయ్ స్వయంగా గానం చేయడం విశేషం. హీరో ఇంట్రో సాంగ్ గా ఈ పాట ఉంటుందని అంటున్నారు. అయితే, తెలుగు వెర్షన్ మాత్రం కాస్త ఆలస్యంగా వస్తుందని బజ్. మరి.. `బీస్ట్` ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ కి ఎలాంటి ఫీస్ట్ ని అందిస్తుందో చూడాలి.
Also Read:వీడెవడు నాకన్నా పిచ్చోడిలా ఉన్నాడనుకున్నా
కాగా, `బీస్ట్`లో సెల్వ రాఘవన్, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. `మాస్టర్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత విజయ్ నుంచి రాబోతున్న ఈ సినిమా కూడా అదే బాట పడుతుందేమో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



