మెగాస్టార్ తో ఆ పరంపరని కొనసాగిస్తారా!
on Dec 19, 2021

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో `ఆచార్య`, `గాడ్ ఫాదర్`, `మెగా 154`, `భోళా శంకర్`, `మెగా 156` చిత్రాలున్నాయి. వీటన్నింటిని కూడా ఇప్పటివరకు చిరుని డైరెక్ట్ చేయని దర్శకులే రూపొందిస్తుండడం విశేషం. `ఆచార్య`కి కొరటాల శివ దర్శకుడు కాగా.. `గాడ్ ఫాదర్`కి మోహన్ రాజా కెప్టెన్. `మెగా 154`ని బాబీ తెరకెక్కిస్తుండగా.. `భోళా శంకర్`ని మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక `మెగా 156`కి వెంకీ కుడుముల నిర్దేశకుడు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. వీరిలో ఒక్క మెహర్ రమేశ్ ని మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా సక్సెస్ ట్రాక్ లో ఉన్నవాళ్ళే.
Also Read:సాయిపల్లవి ఎందుకంత ఎమోషనల్ అయ్యింది?
`మిర్చి`, `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `భరత్ అనే నేను` వంటి వరుస విజయాల తరువాత శివ నుంచి వస్తున్న సినిమా `ఆచార్య` కాగా.. కోలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ `తని ఒరువన్` (`ధృవ`కి మాతృక), `వేలైకారన్` అనంతరం మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న చిత్రం `గాడ్ ఫాదర్`. ఇక బాబీ ప్రీవియస్ మూవీస్ `జై లవ కుశ`, `వెంకిమామ` కూడా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించినవే. అలాగే వెంకీ కుడుముల విషయానికొస్తే.. అతని తొలి రెండు చిత్రాలు `ఛలో`, `భీష్మ` సక్సెస్ ఫుల్ మూవీస్ నే. మరి.. విజయపథంలోనే ఉన్న కొరటాల శివ, మోహన్ రాజా, బాబీ, వెంకీ.. మెగాస్టార్ మూవీస్ తోనూ ఆ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



