కండోమ్స్ కంపెనీ యజమానిగా జగపతిబాబు
on Jan 6, 2020
టాలీవుడ్... కోలీవుడ్... బాలీవుడ్ అని తేడాలు లేవు. ప్రతి భాషలోనూ బోల్డ్ కంటెంట్ బాగా సేల్ అవుతోంది. హిందీలో హేట్ స్టోరీ, రాగిణి ఎంఎంఎస్, గ్రాండ్ మస్తీ సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయంటే... బోల్డ్ కంటెంట్ బాగా సేల్ కావడమే కారణం. తెలుగులోనూ 'ఏడు చేపల కథ', 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాలు వచ్చాయంటే కారణం అదే. మరి ఆ రేంజ్ లో కాకపోయినా... ఒకప్పటి ఫ్యామిలీ చిత్రాల హీరో జగపతిబాబు ఒక బోల్డ్ సినిమా చేస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఒక సినిమాలో జగపతిబాబు కండోమ్స్ తయారీ కంపెనీ యజమానిగా యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమాలో ఆయనే హీరో. శ్రద్ధా దాస్ ఫ్లాష్ బాక్ లో కనిపించే హీరోయిన్. ఆమెది వేశ్య పాత్ర. కండోమ్స్ కంపెనీ యజమానికి ఒక అలవాటు ఉంది. అదేంటంటే... కండోమ్ యాడ్స్ ను వేశ్యలతో మాత్రమే రూపొందిస్తాడు. అలా ఒక యాడ్ చేయడానికి వచ్చిన శ్రద్ధా దాస్ తో ప్రేమలో పడతాడు. వాళ్ళ ప్రేమ కథ ఏంటి? తర్వాత ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాలి.
'లెజెండ్' చిత్రంతో నటుడిగా వెండితెరపై జగపతిబాబుకు కొత్త జీవితం లభించింది. స్టైలిష్, రిచ్ క్యారెక్టర్లకు ఆయన ఒక ఆప్షన్ గా మారారు. 'రంగస్థలం'లో కరుడుగట్టిన పల్లెటూరి ప్రతినాయకుడిగానూ నటించి మెప్పించారు. దాంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. ప్రతినాయకుడిగా, కథానాయకుడి తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. పటేల్ సార్ తప్ప హీరోగా సినిమాలు చేయలేదు. చాలా రోజుల తర్వాత జగపతిబాబు మళ్లీ హీరోగా నటిస్తున్నారు అన్నమాట.
Also Read