Home

»

Latest News

సీక్వెల్‌లో జ‌గ్గూభాయ్ !!!

Feb 14, 2019 8:52AM

ఫ్యామిలీ ఎంట‌ర టైన‌ర్ కేరాప్ అడ్ర‌స్ గా నిలిచిన క‌థానాయుకుల్లోజ‌గ‌ప‌తిబాబు ఒక‌రు. ఆయ‌న కెరీర్ లో బెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా నిలిచిన సినిమా `శుభ‌ల‌గ్నం` 1994లో  వ‌చ్చిన ఈ సూప‌ర్ హిట్ చిత్రాన్ని కుటుంబ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించ‌గా జ‌గ‌ప‌తిబాబుకి జోడీ గా ఆమ‌ని , రోజా న‌టంచారు. డ‌బ్బుంటే పిచ్చి ఉన్న ఓ భార్య‌మ‌ణి , ఆ డ‌బ్బు కోసం త‌న‌ను ప్రాణం క‌న్న మిన్న‌గా ప్రేమించే భ‌ర్త‌ను కూడా అమ్ముకుని డ‌బ్బు మైకంలో ప‌డి ఏం కోల్పోయిందో తెలుసుకున్నాక త‌న త‌ప్పుని ఎలా స‌రిదిద్దుకుంది ? అనే పాయింట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా . అప్ప‌ట్లో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. మ్యూజిక‌ల్ గా సెన్సేస‌న‌ల్ సృష్టించింది. క‌ట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమాకి  సీక్వెల్ గా మ‌రో చిత్రం రాబోతోంద‌ని స‌మాచారం. ఇందులోనూ క‌థానాయ‌కుడిగా జ‌గ‌ప‌తిబాబు న‌టించే అవ‌కాశ‌ముంద‌ని టాలీవుడ్ టాక్. ద‌ర్శ‌కుడు, ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. మ‌రి విల‌న్ , క్యారెక్ట‌ర్ రోల్స్ తో ఫుల్ బిజీ గా ఉన్న జ‌గ్గూభాయ్. త‌న‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన పాతికేళ్ళ నాటి క్లాసిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ సీక్వెల్ తో మ‌రోసారి మెప్పిస్తాడేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com