హీరో..విలన్..హీరో
on Sep 22, 2016

ప్రజంట్ వెండితెరను ఏలుతున్న చాలా మంది హీరోలు కెరిర్ స్టార్టింగ్‌లో విలన్లుగా చేసిన వారే..విలనిజంతో నటుడిగా మార్కులు వేయించుకుని ఆ తర్వాత హీరోగా సూపర్ సక్సెస్ అయినవాళ్లే. చిరంజీవి, రజినీకాంత్, కమల్, గోపిచంద్ ఇలా ఈ లిస్ట్ చాలా పెద్దదే. అయితే వీరందరిలోకి డిఫరెంట్ జగపతి బాబు. అందరూ విలన్ నుంచి హీరో అయితే జగపతి మాత్రం హీరో నుంచి విలన్‌గా...మళ్లీ హీరోగా మారుతున్నాడు. ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసి శోభన్ బాబు తర్వాత అంతటి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే హీరోగా ఛాన్సులు తగ్గిపోవడంతో విలన్‌గా అవతారమెత్తి సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు జగ్గూభాయ్.
బాలయ్య లెజెండ్‌లో విలన్‌గా నటించడంతో జగపతి దశ తిరిగిపోయింది. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలన్ని సూపర్‌హిట్ అవ్వడంతో స్టార్ హీరోలందరి ఫేవరేట్ విలన్‌గా మారిపోయాడు. ఇలాంటి టైంలో మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి జగపతితో సినిమాను నిర్మిస్తున్నట్టు జాగ్వార్ ఆడియో రిలీజ్ వేదిక మీద ప్రకటించారు. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



