యాక్షన్ లో "గబ్బర్ సింగ్"
on Jan 9, 2012
యాక్షన్ లో "గబ్బర్ సింగ్" సినిమా ఉందని విశ్వసనీయవర్గాలద్వారా తెలిసిన సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, హరీష్ శంకర్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రం"గబ్బర్ సింగ్". ప్రస్తుతం ఈ "గబ్బర్ సింగ్" చిత్రం హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ శృతి హాసన్, ఆలీ, రావు రమేష్ రావులపై షూటింగ్ జరుపుకుంటూంది.
జనవరి 12 వ తేదీ నుండి ఈ "గబ్బర్ సింగ్" చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జూనియర్ ఆర్టిస్టులు, హీరో పవన్ కళ్యాణ్ లపై ఈ యాక్షన్ సీన్లను చిత్రీకరించనున్నారు. ఈ "గబ్బర్ సింగ్" చిత్రం హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా సూపర్ హిట్టయిన "దబాంగ్" చిత్రానికి రీమేక్ అన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే.