చిరు, బోయపాటి కాంబోలో `దిల్` రాజు సినిమా!
on Dec 11, 2021

మెగాస్టార్ చిరంజీవి మినహా మెగా కాంపౌండ్ లోని హీరోలందరితోనూ సినిమాలు నిర్మించారు స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయితేజ్.. ఇలా దాదాపు అందరి కాంబోలోనూ విజయవంతమైన చిత్రాలను తీసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజు. అయితే, చిరుతో సినిమా తీయాలన్న ఆయన కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది.
బాలీవుడ్ బాటలో బాలయ్య `అఖండ`?
కాగా, త్వరలోనే మెగాస్టార్ తో రాజు ఓ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మించబోతున్నారట. అంతేకాదు.. ఆ చిత్రాన్ని ఓ స్టార్ కెప్టెన్ కాంబోలోనే నిర్మించనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. `దిల్` రాజు నిర్మించిన `భద్ర` చిత్రంతోనే దర్శకుడిగా పరిచయమై ఆనక పలు విజయవంతమైన చిత్రాలతో అగ్ర నిర్దేశకుడిగా ఎదిగిన మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను.. త్వరలోనే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ లో మరో మూవీ చేసే అవకాశముందని టాక్. ఈ చిత్రమే.. చిరు కాంబోలో ఉంటుందని సమాచారం.
చరిత్ర సృష్టించాలన్నా, తిరిగి రాయాలన్నా మనమే!
`అఖండ` ఘనవిజయంతో మళ్ళీ టాక్ ఆఫ్ టాలీవుడ్ అయిన బోయపాటి.. త్వరలో బన్నీతో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు. మరోవైపు `ఆచార్య`, `గాడ్ ఫాదర్`, `మెగా 154`, `భోళా శంకర్` చిత్రాలతో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. సో.. 2023 ద్వితీయార్ధంలో ఈ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కే అవకాశముండొచ్చు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. చూద్దాం.. ఏం జరుగుతుందో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



