'అఖండ' యాక్షన్ ఎపిసోడ్స్.. మాస్ కి పూనకాలే!
on Dec 2, 2021
డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాలు అంటేనే యాక్షన్ ఎపిసోడ్స్ కి కేరాఫ్ అడ్రెస్ అన్నట్లు ఉంటాయి. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణతో సినిమా అంటే ఆ యాక్షన్ డోస్ ను మరింత పెంచేస్తాడు బోయపాటి. 'సింహా', 'లెజెండ్' సినిమాలలో పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో మాస్ ని మెప్పించిన బోయపాటి.. 'అఖండ' సినిమాతో మాస్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు.
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'అఖండ'. నేడు(డిసెంబర్ 2 న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య.. మురళీకృష్ణ, అఘోరా(అఖండ) పాత్రల్లో మెప్పించాడు. అఘోరా పాత్రలో బాలయ్య చూపించిన నట విశ్వరూపానికి థియేటర్లు మారుమోగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. మురళీకృష్ణ ఎంట్రీ సీన్ తో పాటు, వరదరాజులు(శ్రీకాంత్) మనుషులతో మురళీకృష్ణ తలపడే సన్నివేశాలు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఇక ఇంటర్వెల్ కి ముందు వచ్చే అఘోరా ఎంట్రీ సీన్ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. ఫస్ట్ హాఫ్ లో ఈ మూడు యాక్షన్ ఎపిసోడ్స్ యే చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయంటే.. ఇక సెకండ్ హాఫ్ లో అఘోరా, విలన్ గ్యాంగ్ తో తలపడే సన్నివేశాలు, క్లైమాక్స్ అంతకుమించి ఉన్నాయి.
మొత్తానికి 'అఖండ'లోని యాక్షన్ ఎపిసోడ్స్ బాలయ్య ఫ్యాన్స్ కి, మాస్ ఆడియన్స్ కి పండగనే చెప్పాలి. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సుదీర్ఘంగా సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఇష్టపడకపోవచ్చు.
హ్యాట్రిక్ కొట్టేశారు.. బాలయ్యని ఎలా చూపించాలో బోయపాటికి తెలుసు!

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
