Home

»

Latest News

ఖండ ఖండాలలో 'అఖండ' జాతర.. రికార్డుల వేట మొదలైంది!

Dec 02, 2021

'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'అఖండ'. నేడు(డిసెంబర్ 2 న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య.. మురళీకృష్ణ, అఘోరా(అఖండ)  పాత్రల్లో మెప్పించాడు. అఘోరా పాత్రలో బాలయ్య చూపించిన నట విశ్వరూపానికి థియేటర్లు మారుమోగిపోతున్నాయి. విదేశాల్లో కూడా  'అఖండ'కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అమెరికాలో అఖండకు రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి.

సెకండ్ లాక్‌డౌన్ త‌ర్వాత వచ్చిన తొలి భారీ బ‌డ్జెట్ మూవీ కావ‌డంతో 'అఖండ' కోసం ప్రేక్షకులు భారీగా థియేటర్స్ కి తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా ఇలా విదేశాలలో కూడా బాలయ్య ఫ్యాన్స్ అఖండ థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. అఖండ ప్రీమియర్ కు ముందు కాలిఫోర్నియాలోని సెర్రా థియేటర్స్ లో అయితే బాలయ్య అభిమానులు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. దీంతో బాలయ్య 'అఖండ'తో అప్పుడే రికార్డుల వేటలో పడ్డాడు. ఈ ఏడాది ఇప్పటివరకు అమెరికాలో విడుదలైన తెలుగు సినిమాలలో అఖండ 'హైయెస్ట్ ఓపెనింగ్ ప్రీమియర్ గ్రాసర్'గా నిలిచింది. 

'అఖండ' అప్పుడే రికార్డుల వేటలో పడటంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా 'సింహా', 'లెజెండ్' లను మించిన విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నారు. మరి ముందు ముందు అఖండ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం.

హ్యాట్రిక్ కొట్టేశారు.. బాలయ్యని ఎలా చూపించాలో బోయపాటికి తెలుసు!

'అఖండ' మూవీ రివ్యూ

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com