'అఖండ'తో బోయపాటి హ్యాట్రిక్‌కు బ్రేకేసిన బాలయ్య!
on Dec 2, 2021
మాస్ ఎంటర్టైనర్స్ ని తెరకెక్కించడంలో అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను స్టైలే వేరు. `భద్ర`, `తులసి`, `సింహా`, `లెజెండ్`, `సరైనోడు` చిత్రాలతో మాస్ ఆడియన్స్ ని భలేగా ఎంటర్టైన్ చేసిన బోయపాటి.. మళ్ళీ చాన్నాళ్ళ తరువాత `అఖండ`తో ఆ మ్యాజిక్ ని కొనసాగించారు. తొలి ఆట నుంచే రోరింగ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ యాక్షన్ డ్రామా.. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మరో మెమరబుల్ మూవీగా నిలిచిందన్నది పబ్లిక్ రెస్పాన్స్.
ఇదిలా ఉంటే.. బోయపాటికి ఇప్పటికే `సింహా`, `లెజెండ్`తో రెండు సార్లు కలిసొచ్చిన బాలయ్య.. `అఖండ`తో హ్యాట్రిక్ కాంబోగా నిలిచారు. అంతేకాదు.. గతంలో `భద్ర`, `తులసి`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బోయపాటికి `సింహా`తో హ్యాట్రిక్ కి కారణమైన బాలయ్య.. ఇప్పుడు `జయ జానకి రామ`, `వినయ విధేయ రామ` వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో సతమతమవుతున్న అదే బోయపాటికి `అఖండ`తో హ్యాట్రిక్ ఫ్లాప్ రాకుండా బ్రేకేశారు. మొత్తమ్మీద.. బాలయ్య కాంబోతో బోయపాటి ఆల్ టైమ్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారనే చెప్పాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
