`కిరాయి రౌడీలు`గా చిరు, మోహన్ బాబు అలరించి నేటికి 40 ఏళ్ళు!
on Dec 24, 2021

మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను భలేగా ఎంటర్టైన్ చేశాయి. వాటిలో `కిరాయి రౌడీలు`కి ప్రత్యేక స్థానముంది. అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ చిత్రంలో చిరు, మోహన్ బాబు పోటీపడి మరీ నటించారు. చిరంజీవికి జంటగా రాధిక నటించిన ఈ సినిమాలో మోహన్ బాబుకి జోడీగా సువర్ణ కనిపించారు. రావు గోపాల రావు, ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, అత్తిలి లక్ష్మి, వనిత, మల్లికార్జునరావు ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
Also Read:భారీగా పడిపోయిన 'పుష్ప' వసూళ్లు! ఆంధ్రప్రదేశ్‌లో భోరుమంటున్న బయ్యర్లు!
దిగ్గజ స్వరకర్త చక్రవర్తి సంగీతానికి దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. చిరంజీవి కెరీర్ లో 35వ చిత్రంగా రూపొందిన `కిరాయి రౌడీలు`.. ఫారెస్ట్ లొకేషన్ `తలకోన`లో షూటింగ్ జరుపుకున్న మొదటి తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది. హిందీలో ఈ చిత్రాన్ని `హోషియార్` (1985) పేరుతో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రీమేక్ చేయగా.. జితేంద్ర, శత్రుఘ్న సిన్హా, జయప్రద, మీనాక్షి శేషాద్రి ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీకాంతి చిత్ర పతాకంపై క్రాంతి కుమార్ నిర్మించిన `కిరాయి రౌడీలు`.. 1981 డిసెంబర్ 24న విడుదలై మంచి విజయం సాధించింది. నేటితో ఈ సినిమా 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



