గ్రామ వాలంటీర్.. ఇంటింటికి వెళ్లి కోటా సరుకులు ఇస్తారు అదేనా!
on Dec 24, 2021

విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు మరో విభిన్న చిత్రంలో త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. 'జోహార్' ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం 'అర్జున ఫల్గుణ'. ఈ సినిమా డిసెంబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఇది పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా అని అర్థమవుతోంది. ఇందులో శ్రీవిష్ణు జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా కనిపిస్తున్నాడు. 'అరవింద సమేత' సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్ కటౌట్ ముందు ఫ్రెండ్స్ తో కలిసి విష్ణు డ్యాన్స్ చేయడం ట్రైలర్ లో కనిపించింది. అంతేకాదు మీ పేర్లేంటి అని ఒక వ్యక్తి అడగగా.. విష్ణు మరియు అతని ఫ్రెండ్స్ ఆది, సింహాద్రి, రాఖీ, యమదొంగ అంటూ ఎన్టీఆర్ సినిమా పేర్లు చెప్పడం ఆకట్టుకుంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో శ్రీవిష్ణు, హీరోయిన్ అమృత అయ్యర్ మధ్య లవ్ ట్రాక్ నేచురల్ గా సరదాగా ఉంది. ఇంతకీ ఏ ఉద్యోగం అని హీరోయిన్ ని ఒకరు అడగగా.. గ్రామ వాలంటీర్ అని సమాధానం చెప్తుంది. దానికి విష్ణు 'ఇంటింటికి వెళ్లి కోటా సరుకులు ఇస్తారు అదేనా' అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇలా గర్ల్ ఫ్రెండ్, ముగ్గురు ఫ్రెండ్స్ తో సాఫీగా సాగిపోతున్న విష్ణు లైఫ్ లో ఊహించని మలుపు వస్తుందని, ఫ్రెండ్స్ తో కలిసి విష్ణు ఒక క్రైమ్ లో ఇరుక్కుంటాడని ట్రైలర్ ని బట్టి తెలుస్తుంది. మరి 'అర్జున ఫల్గుణ'తో మరోసారి శ్రీవిష్ణు ప్రేక్షకులను మెప్పిస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



