Home

»

Latest News

భారీగా ప‌డిపోయిన 'పుష్ప' వ‌సూళ్లు! ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భోరుమంటున్న‌ బ‌య్య‌ర్లు!

Dec 23, 2021

 

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూడో మూవీ 'పుష్ప ది రైజ్' క‌లెక్ష‌న్లు 6వ రోజు భారీ స్థాయిలో ప‌డిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో భారీ వ‌సూళ్ల‌ను సాధించిన ఈ సినిమా సోమ‌వారం నుంచి అనూహ్య స్థాయిలో ప‌డిపోతూ వ‌స్తున్నాయి. 6వ రోజు తెలుగునాట 'పుష్ప' కేవ‌లం రూ. 2.08 కోట్ల షేర్ మాత్ర‌మే రాబ‌ట్టింది. తెలంగాణ‌లో రూ. 1.03 కోట్ల షేర్ వ‌సూలు చేసిన‌ 'పుష్ప‌', ఆంధ్ర‌లో కేవ‌లం రూ. 68 ల‌క్ష‌లు, రాయ‌ల‌సీమ‌లో రూ. 37 ల‌క్ష‌ల షేర్ మాత్ర‌మే వ‌సూలు చేయ‌గ‌లిగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొన్ని థియేట‌ర్ల‌ను సీజ్ చేయ‌డం, అత్య‌ల్ప టికెట్ ధ‌ర‌ల కార‌ణంగా కొన్ని థియేట‌ర్లు మూత‌ప‌డ‌టం వ‌సూళ్ల‌పై దారుణంగా దెబ్బ‌కొట్టింది.

Also read: 'పుష్ప'కి వస్తున్న రెస్పాన్స్ పై 'అక్షయ్ కుమార్' రియాక్షన్

ఇక ఓవ‌రాల్‌గా 6 రోజుల‌కు తెలుగునాట 'పుష్ప' వ‌సూళ్లు రూ. 65.85 కోట్ల షేర్‌కు చేరుకుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతాల్లో 'పుష్ప‌' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 101.75 కోట్లు. అంటే 64.7 శాతమే రిక‌వ‌ర్ అయ్యింది. ఈ లెక్క‌న తెలుగునాట 'పుష్ప' బ‌య్య‌ర్లు లాభాలు చ‌విచూసే అవ‌కాశాలు ఏమాత్రం క‌నిపించ‌డం లేదు. నైజాంతో పోలిస్తే ఆంధ్ర‌, రాయ‌ల‌సీమ బ‌య్య‌ర్లు దారుణంగా న‌ష్ట‌పోనున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. 

Also read: మూవీ హిస్ట‌రీలోని బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్‌లో ఒక‌టి.. 'పుష్ప‌' ప‌ర్ఫార్మెన్స్‌!

విడుద‌లైన తొలి మూడు రోజుల్లో వ‌రుస‌గా రూ. 24.90 కోట్లు, రూ. 13.70 కోట్లు, రూ. 14.38 కోట్ల షేర్ రావ‌డంతో నిర్మాత‌లు, బ‌య్య‌ర్లు హుషారుగా క‌నిపించారు. కానీ ఆ త‌ర్వాత ఊహించ‌ని దానికి మించి సోమ‌వారం నుంచి తెలుగునాట వ‌సూళ్లు దారుణంగా ప‌డిపోతూ వ‌స్తున్నాయి. సోమ‌వారం రూ. 6.93 కోట్ల షేర్‌కు ప‌డిపోయిన వ‌సూళ్లు.. ఆ త‌ర్వాత మ‌రింత దిగ‌జారి మంగ‌ళ‌వారం రూ. 3.87 కోట్లు, బుధ‌వారం రూ. 2.08 కోట్ల షేర్ న‌మోద‌యిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com