శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. కొంతకాలంగా ఒకే ఇంట్లో!
on Jan 8, 2022

'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన నిధి అగర్వాల్.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. శింబు నటించిన 'ఈశ్వరన్' సినిమాతో కోలీవుడ్ లోనూ అడుగుపెట్టిన నిధి.. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో అలరిస్తోంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు కోలీవుడ్ ప్లే బాయ్ గా పేరున్న శింబుతో ప్రేమలో ఉందని వార్తలొస్తున్నాయి.
కోలీవుడ్ స్టార్ శింబు గతంలో నయనతార, హన్సిక వంటి హీరోయిన్స్ తో ప్రేమాయణం సాగించాడు. ఇప్పుడు శింబు లవ్ ట్రాక్ లోకి నిధి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ‘ఈశ్వరన్’సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అంతేకాదు గత కొంతకాలంగా నిధి చెన్నైలోని శింబు ఇంట్లోనే ఉంటోందని తెలుస్తోంది. ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ న్యూస్ వినిపిస్తోంది.
'శింబు ప్రేమలో నిధి' అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. ఒకవేళ నిజమైతే గతంలో నయనతార, హన్సిక లకు హ్యాండ్ ఇచ్చినట్లు నిధికి కూడా శింబు షాక్ ఇస్తాడో లేక నిజంగానే పెళ్లి చేసుకుంటాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



