కారవాన్‌లో కాక రేపుతున్న పాయల్!
on Feb 4, 2022

గ్లామర్ దండిగా ఉన్నా ఆశించిన రీతిలో అవకాశాలు లభించిన తారల్లో పాయల్ రాజ్‌పుత్ పేరు చెప్పుకోవాలి. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన 'ఆర్ఎక్స్ 100'లో తన బోల్డ్ పర్ఫార్మెన్స్‌తో కుర్రకారు గుండెల్లో గుబులురేపిన ఈ ఢిల్లీ అమ్మాయి.. ఆ తర్వాత వెంకటేశ్ జోడీగా 'వెంకీమామ', రవితేజ సరసన 'డిస్కో రాజా' సినిమాలు చేసింది. అయితే క్రేజీ యంగ్ హీరోల్లో ఇంతదాకా ఎవరితోనూ జోడీగా నటించే చాన్స్ ఆమెకు దక్కలేదు. ప్రస్తుతం పాయల్ ఆది సాయికుమార్ సరసన 'కిరాతక' సినిమాలో నటిస్తోంది. ఇదివరకు ఆ ఇద్దరూ కలిసి 'అనగనగా ఓ అతిథి' సినిమాలో నటించారు. Also read: 'మహాన్' ట్రైలర్.. తండ్రి పేరు చెడగొడుతున్న కొడుకు!
రీసెంట్‌గా పాయల్ షేర్ చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో గురువారం రాత్రి షూటింగ్ సందర్భంగా తన వానిటీ వ్యాన్ నుంచి దిగిన ఫొటోను చేసిన పాయల్, దానికి "Chaos in my Vanity. #nightshoots " అనే క్యాప్షన్ పెట్టింది. ఆ ఫొటోలో బ్లాక్ కలర్ టాప్, రెడ్ కలర్ బాటమ్ పీస్‌తో హాట్‌నెస్‌కు పరాకాష్ఠ అన్నట్లు పోజిచ్చింది పాయల్. ఆమెను ఆ పోజులో చూస్తుంటే ఎవరికైనా మతులు చలించకుండా ఉంటాయా! Also read: 'పుష్ప' లాంటి సినిమాల వల్ల సమాజం చెడిపోతుంది.. గరికపాటి సెన్సేషనల్ కామెంట్స్
తెలుగులో 'కిరాతక' మూవీతో పాటు తమిళంలో 'ఏంజెల్', 'గోల్‌మాల్' అనే రెండు సినిమాలు చేస్తోందామె. అలాగే 'హెడ్ బుష్' అనే సినిమాతో కన్నడ చిత్రరంగంలో అడుగుపెట్టనుంది. రానున్న రోజుల్లోనైనా ఆమె కెరీర్ ఊపందుకుంటుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



