English | Telugu
త్వరలో జీ తెలుగులో ప్రారంభంకానున్న కొత్త సీరియల్ " శుభస్య శీఘ్రం"
Updated : Nov 9, 2022
జీ తెలుగులో కొత్త సీరియల్స్ హవా ఎక్కువయ్యింది. ఇప్పటికే "పడమటి సంధ్యారాగం, అమ్మాయిగారు" వంటి సీరియల్స్ స్టార్ట్ ఐపోయాయి. ఇక ఇప్పుడు మరో కొత్త సీరియల్ లైన్ లో ఉంది. అదే "శుభస్య శీఘ్రం". ఒక మధ్యతరగతి తల్లికి అండగా ఉండే కూతురు తన కుటుంబాన్ని ఆపదల నుండి ఎలా కాపాడుకుందో అనే ఒక ఆసక్తికర కథాంశంతో ఈ సీరియల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీరియల్ లో మహేష్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇంతకు ముందు "మనసిచ్చి చూడు" సీరియల్ లో హీరో ఆది క్యారెక్టర్ లో నటించాడు. హీరోయిన్ గా కృష్ణ ప్రియా నటిస్తోంది. ఈమె మలయాళీ అమ్మాయి..తెలుగులో కృష్ణ ప్రియా నటిస్తున్న మొదటి సీరియల్ ఇదే. ఇక ఈ సీరియల్ లో నటి భావన మెయిన్ రోల్ లో నటిస్తోంది.
భావన ఇంతకుముందు "కల్యాణ వైభోగం, కలిసి ఉంటే కలదు సుఖం" సీరియల్స్ లో నటించింది. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న మరో ముఖ్య పాత్ర సాండ్ర జయచంద్రన్. ఈ సీరియల్ లో హీరోయిన్ కి అక్క పాత్రలో ఈమె నటిస్తోంది. ఈమె ఇంతకుముందు "ముద్దమందారం, కుంకుమ పువ్వు, రాధమ్మ కూతురు" వంటి సీరియల్స్ లో నటించింది. ఇక ఈ సీరియల్ లో అక్కచెల్లెళ్లకు అమ్మ క్యారెక్టర్ లో ఉమాదేవి నటిస్తోంది. ఈమె ఇంతకు ముందు కార్తీక దీపం, కల్యాణ వైభోగం, శ్రీమతి-శ్రీనివాస్ వంటి సీరియల్స్ లో నటించింది. ఇక ఈ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మోక్ష నటిస్తోంది.