English | Telugu
‘కాంతార’ సీన్‌తో అదరగొట్టిన నూకరాజు!
Updated : Nov 9, 2022
తెలుగు ఆడియన్స్ ని అలరించే కామెడీ షోల్లో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ కామెడీ షోకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లేటెస్ట్ గా ఈ షో‘మదర్స్-డాటర్స్’ అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఇక ఈ ప్రోమోలో సుడిగాలిసుధీర్ కనిపించి షోకి కొత్త ఎనర్జీ ఇచ్చాడు. అయితే ఈ ప్రోమోలో ‘కాంతార’ మూవీలోని క్లైమాక్స్ సీన్ ను నూకరాజు రీక్రియేట్ చేసి అద్భుతంగా నటించాడు. తాజాగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో కూడా ‘కాంతార’ క్లైమాక్స్ ను రీక్రియేట్ చేశారు. ఈ సీన్ వలన రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఇదేహైలెట్ గా నిలిచింది. ఇక ఇందులో సుధీర్, రాంప్రసాద్ సందడి వేరే లెవేల్ అని చెప్పొచ్చు. కొంతమంది కమెడియన్స్ సుధీర్ పై సెటైర్లు కూడా వేశారు. 'మదర్స్-డాటర్స్' అనే కాన్సెప్ట్ తో అమ్మలకు, కూతుళ్లకు పోటీలు నిర్వహించారు. బుల్లితెర బ్యూటీలు భాను, వర్ష డాన్సులతో స్టేజిని అదరగొట్టారు.
ఇక భానుశ్రీ తన పాటతో అందరిని ఎమోషనల్ అయ్యేలా చేసింది. యాకర్ రష్మీ సైతం భానుశ్రీ పాడిన పాటకు కన్నీళ్లు పెట్టేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.