English | Telugu
వరెస్ట్ గేమర్ ఇన్ ద హౌస్ ఫైమా!
Updated : Nov 9, 2022
బిగ్ బాస్ అరవై అయిదవ రోజు 'రగులుతోంది మొగలి పొద' పాటతో మొదలైంది. ఆ తర్వాత హౌస్ మేట్స్ మొన్న జరిగిన నామినేషన్ గురించి సరదగా మాట్లాడుకున్నారు. అయితే ఫైమా, ఒక్కో హౌస్ మేట్ దగ్గరకు వెళ్ళి, ఇనయా గురించి నెగెటివ్ గా చెప్పడం మొదలు పెట్టింది. మరో వైపు గీతు లేదని ఆదిరెడ్డి ఒక్కడే కూర్చున్నాడు. "గీతు విల్ కమ్ బ్యాక్. ఐ కుడ్ సెన్స్ ఇట్. నన్ను ఎవరు మోసం చేయలేరు" అంటు ఒంటరిగా కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటున్నాడు.
అయితే స్నేక్ లాడర్ గేమ్ లో ఒక్కో కంటెస్టెంట్ పోటీపడి పర్ఫామెన్స్ ఇస్తూ వస్తోన్నారు. కాగా మొదటి రౌండ్ లో లాడర్ టీం నుండి శ్రీసత్య అవుట్ అవ్వగా, స్నేక్ టీం నుండి రోహిత్ అవుట్ అయ్యడు. ఆ తర్వాత గేమ్ లో భాగంగా ఫైమా, ఇనయాని టార్గెట్ చేసింది. ఇనయా మట్టిని లాగేసుకోవడానికి ప్రయత్నించగా స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇద్దరు శత్రువులు ఒకరికొకరు ఎదురెదురుగా ఉండి గొడవ పడ్డట్లుగా వీరి మధ్య ఆట కొనసాగింది. వీరి ఆటతీరును చూసిన ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇనయా, ఫైమాల మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది.
టాస్క్ ముగిసాక మొదటి రౌండ్ లో ఎవరు తప్పుకున్నారో సంచాలక్ ని చెప్పమన్నాడు బిగ్ బాస్. సంచాలక్ గా వ్యవహరిస్తోన్న ఫైమా, కంటెస్టెంట్స్ మట్టితో చేసిన స్నేక్ లు చూసింది. కాగా అందులో "ఇనయా చేసిన స్నేక్ సరిగ్గా లేదు బిగ్ బాస్" అని ఫైమా చెప్పి, ఇనయాని తొలగించింది. ఆ తర్వాత ఇనయా బాధపడుతూ మాట్లాడింది. "కావాలని నన్ను గేమ్ నుండి తప్పించారు" అంటూ ఒక్కొక్కరి మీద కోపంతో రగిలిపోయింది. ఫైమాను టార్గెట్ చూస్తూ తిడుతూ ఉండగా, రేవంత్ మధ్యలో ఆపడానికి ప్రయత్నించాడు. కానీ తను ఆపకుండా అలాగే కొనసాగించింది. "ఫేక్ ఫైమా. వరెస్ట్ పర్ఫామర్. వరెస్ట్ గేమర్ ఇన్ ద హౌస్ ఫైమా" అంటూ ఇనయాను తిట్టేసింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరు చెప్పేసరికి బెడ్ రూంకి వెళ్ళి, తన బెడ్ పై పడుకొని ఏడుస్తూ ఉంది. అయితే ఈ గేమ్ లో ఏకపక్షంగా సాగింది అనే చెప్పాలి. ఇనయాని టార్గెట్ చేస్తూ ఫైమా ఆడింది. చివరికి ఇనయా గేమ్ నుండి తప్పుకుంది. అలా ఈ టాస్క్ ముగిసింది.