English | Telugu

'స్నేక్-లాడర్' ఆటలో గెలిచేదెవరు?


ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో సరికొత్త టాస్క్ మొదలైంది. అది వైకుంఠపాలి ఆట. కొందరు స్నేక్ టీం, మరికొందరు లాడర్ టీం లుగా ఉంటారు.

"ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా స్నేక్, లాడర్ ల ఆట ఆడాల్సి ఉంటుంది. సగం మంది సభ్యులు మట్టితో స్నేక్ ని కట్టాల్సి ఉంటుంది. సగం మంది సభ్యులు లాడర్ ను కట్టాల్సి ఉంటుంది. టాస్క్ లో భాగంగా సమయానుసారం పాము సౌండ్ వచ్చినప్పుడు లాడర్ లు ఏవి? అని వెళ్లి ఆ లాడర్ ను చిన్నదిగా చేసి, ఆ మట్టిని తమ స్నేక్ కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. " అని బిగ్ బాస్, కంటెస్టెంట్స్ తో చెప్పాడు.

కాగా మొదట సగం మంది కంటెస్టెంట్స్ లాడర్ తయారు చేసారు. మిగిలిన వాళ్ళు స్నేక్ ని చేసారు. కాగా స్నేక్ టీం లో 'ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్, వసంతి, ఫైమా, కీర్తి' ఉండగా, లాడర్ టీం లో 'రేవంత్, రాజ్, ఆదిత్య, మెరీనా, ఇనయా, శ్రీసత్య' ఉన్నారు. కాగా రాజ్, కీర్తి భట్ మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కీర్తి భట్ చేతికి స్వల్పంగా గాయం కాగా, కీర్తి భట్ ఏడ్చేసింది. మిగిలిన హౌస్ మేట్స్ కీర్తి భట్ ని ఓదార్చే ప్రయత్నం చేయగా, "ఈ గాయం వల్ల గేమ్ ఆడలేకపోతున్నా" అని కీర్తి భట్ బాధపడుతూ ఏడుస్తోంది.

అయితే ఈ వారం మొత్తం జరిగే ఈ స్నేక్, లాడర్ గేమ్ లో ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళే విజేతలుగా నిలుస్తారు. కాగా రోహిత్, రేవంత్ ఇద్దరు హౌస్ లో ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్నారు. అయితే ఈ గేమ్ లో అయిన రేవంత్ తన అగ్రెసివ్ బిహేవియర్ తగ్గించుకుంటాడో లేక నాగార్జునతో మాటలు అనిపించుకుంటాడో చూడాలి మరి.