English | Telugu
అనుని భయపెట్టిన టెడ్డీబేర్ ఎవరు?
Updated : Feb 16, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. జీ తెలుగులో గత కొన్ని వరాలుగా ప్రసారం అవుతున్నఈ సీరియల్ కు మరాఠీ సీరియల్ `తుల ఫఠేరే` ఆధారం. శ్రీరామ్ వెంకట్, వర్ష, రామ్ జగన్, జయలలిత, విశ్వమోహన్, జ్యోతిరెడ్డి, అనుషా సంతోష్ కీలక పాత్రల్లో నటించారు. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. జీ తెలుగులో రేటింగ్ పరంగా ముందు వరుసలో వుంది.
Also read:ఆర్యవర్ధన్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
గురువారం హైలైట్ స్ ఏంటో చూద్దాం. మాన్సీ రాకపోవడంతో నీరజ్ కంగారుపడుతూ వుంటాడు. ఇంతలో మాన్సీ ఫుల్లుగా తాగేసి తూలుతూ వస్తూ వుంటుంది. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మాన్సీ .. మామిల్లా తమ్ముంటే కిందిరిరా అంటూ అరుస్తుంటుంది. అదే సమయంలో తన తల్లి నిర్మలాదేవి కిందికి దిగుతుండటం గమనించిన నీరజ్.. తన భార్య నోరు మూసి గదిలోకి తీసుకెళతాడు. ఆ దృశ్యం నీరజ్ తల్లి కంటపడుతుంది. వెంటనే తనకి కళ్లు తిరిగి అలా చేస్తోందని నమ్మించే ప్రయత్నం చేస్తాడు.
కట్ చేస్తే.. గెస్ట్ హౌస్ లో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ అంటూ అక్కడే వుండిపోయిన ఆర్యవర్ధన్.. అనుతో రొమాంటిక్ ఆటలు ఆడుతూ మొత్తానికి లిప్ లాక్ లాగించేస్తాడు. కట్ చేస్తే.. ఆర్యవర్ధన్ కనిపించకపోవడంతో ఎక్కడ వున్నారని అను వెతుకుతూ వుంటుంది. ఇంతలో అనురూమ్‌లో టెడ్డీ బేర్ గెటప్ లో ఎంట్రీ ఇచ్చిన ఓ యువకుడు అనుని భయపెట్టడం మొదలుపెడతాడు. ఆ తరువాత ఏం జరిగింది? .. ఇంతకీ టెడ్డీబేర్ రూపంలో వచ్చింది ఎవరు? .. ఆ వ్యక్తిని ఆర్యవర్ధనే ఏర్పాటు చేయించాడా? .. దీనిపై అను రియాక్షన్ ఏంటీ? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.