English | Telugu
Krishna Mukunda Murari : నారీ నారీ నడుమ మురారి.. భార్య వర్సెస్ మాజీ ప్రియురాలు!
Updated : Nov 12, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -312 లో.. నందు ఇంటికి వస్తుందని మురారితో భవాని చెప్తుంది. మురారికి నందు ఎవరో కూడా గుర్తుండదు. నందు ఎవరని అనగానే.. నీ చెల్లి అని భవాని చెప్తుంది. నందు వచ్చాక ఇక్కడే వారం రోజులు ఉండమని చెప్పు అని మురారి అంటాడు. దాంతో భవాని హ్యాపీగా ఫీల్ అవుతుంది.
కృష్ణ దగ్గరికి మధు వచ్చి.. ముకుంద, మురారి ఇద్దరు షాపింగ్ కి వెళ్తున్నారు. లొకేషన్ పంపిస్తాను నువ్వు కూడా వెళ్ళని కృష్ణకి మధు చెప్పగా.. సరేనని కృష్ణ అంటుంది. మరి డబ్బులు ఉన్నాయా అని మధు అడుగగా.. మా ఆయన ఉన్నాడు కదా డబ్బులు ఎందుకని కృష్ణ అంటుంది. మరొక వైపు మురారి తనతో షాపింగ్ కి కృష్ణని కూడా తీసుకొని వెళదామని అనుకుంటాడు. అందుకే ఆ విషయం కృష్ణకి చెప్పాలని, ఇంట్లో ఎవరు చూడకుండా కృష్ణ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు . అప్పుడే మురారిని భవాని చూసి తనదగ్గరికి వస్తుంది. భవాని వచ్చి.. ఎక్కడికి వెళ్తున్నావని మురారిని అడుగుతుంది. మురారి తడబడుతుంటే కృష్ణ దగ్గరికి వెళ్తున్నాడని భవానికి డౌట్ వచ్చి.. మీరు వచ్చేటప్పుడు ఒక లిస్ట్ చెప్తాను అవి తీసుకొని రమ్మని భవాని చెప్తుంది. కాసేపటికి ముకుంద మురారి షాపింగ్ కి వెళ్తారు. అక్కడ ముకుంద మనిషి వచ్చి కావాలనే.. "మీరు మేడమ్ చాలా రోజులు అవుతుంది. ఇలా రావడం" అని అంటాడు. ఏంటి ముకుందతో ఇదివరకు షాపింగ్ కి వచ్చానా? నాకు గుర్తు లేదని మురారి అనుకుంటాడు. ఎప్పటిలాగే మీరే మేడమ్ కి సెలక్ట్ చెయ్యాలని ముకుంద మనిషి అంటాడు.
ఆ తర్వాత ముకుందకి మురారి చీర సెలక్ట్ చేస్తాడు మురారి. అప్పుడే ఒక అతను వచ్చి ఇది ఆల్రెడీ ఒకరు తీసుకున్నారని అనగానే.. ఆ చీర మురారి సెలక్ట్ చేసాడు కాబట్టి ఆ చీరనే ముకుంద కావాలని అనుకుంటుంది. ఆ చీర తీసుకున్న మేడమ్ ని రిక్వెస్ట్ చెయ్యండని అక్కడ ఉన్న అతను అంటాడు. ఆ తర్వాత ఆ చీర తీసుకుంది ఎవరో కాదు కృష్ణ.. అక్కడ కృష్ణని చూసి ముకుంద షాక్ అవుతుంది మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. "నేను సెలెక్ట్ చేసుకున్న చీరని ఎవరికి ఇవ్వను" అని కృష్ణ ఖచ్చితంగా చెప్తుంది. మరొక వైపు భవాని ఇంటికి నందు, గౌతమ్ ఇద్దరు వస్తారు. మురారి విషయం మొత్తం నందు, గౌతమ్ లకి భవాని చెప్తుంది. తరువాయి భాగంలో.. " నువ్వు ఒక షర్ట్ తీసుకో, నేనొక షర్టు తీసుకుంటా. ఏసీపీ సర్ ని పిలిచి ఎవరు సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చిందో అడుగుదాం" అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత మురారిని కృష్ణ పిలిచి.. ఏ షర్ట్ నచ్చిందోనని అడుగుతుంది. మురారి తన భార్యని గెలిపిస్తాడా లేక ఒకప్పటి మాజీ ప్రేమికురాలిని గెలిపిస్తాడా లేదా తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.