English | Telugu
కరాటే కళ్యాణి చుట్టూ ఏం జరుగుతోంది?
Updated : Jan 2, 2022
కరాటే కళ్యాణి ... 'బాబీ' అంటూ బ్రహ్మీతో కామెడీని పండించిన ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల `మా` ఎలక్షన్స్ సమయంలో హేమకు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ వార్తల్లో నిలిచిన కరాటే కల్యాణీ గత కొంత కాలంగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇరుక్కుంటున్నారు అనడం కంటే వివాదాల చుట్టే తిరుగుతున్నారు.
వివాదం ఎక్కడుంటే కరాటే కల్యాణి అక్కడ వుంటోంది అన్నట్టుగా మారింది అమె వ్యవహారశైలి. తాజాగా ఆమె శివశక్తి ట్రస్ట్ పై సంచలన ఆరోపణలు చేశారు. సదరు ట్రస్ట్ నిర్వాహకులు కోటి రూపాయల మేరకు నిధులను పక్కదారి పట్టించారని కల్యాణి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. హిందువులని తప్పుదోవ పట్టిస్తూ శివశక్తి ట్రస్ట్ సభ్యులు నిధులు సేకరిస్తున్నారని, అప్పటికే సేకరించిన మొత్తంలో కోటి మాయం చేశారని కల్యాణి సంచలన ఆరోపణలు చేశారు.
Also Read:సంక్రాంతికి 'హీరో'గా వస్తోన్న అశోక్ గల్లా
దీంతో సదరు ట్రిస్ట్ నుంచి తనకు బెదిరింపులు మొదలయ్యాయిని, తనని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆమె ఆరోపణలు చేస్తోంది. తనకు శివశక్తి ట్రస్ట్ సభ్యుల నుంచి ప్రాణ హాని వుందని తాజాగా బంజారాహిల్స్ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు చేశారు. ట్రస్ట్ చేసే తప్పుడు పనులు బయటపెడుతున్న తనని హత్య చేయాలని చూస్తున్నారని కల్యాణి ఫిర్యాదు చేసింది. గతంలోనూ కల్యాణి ఓ మైనర్ బాలిక హత్య ఉదంతం కేసులోనూ వివాదంలో చిక్కుకుని ఆ తరువాత బయటపడింది.