English | Telugu
సిరి, షణ్ణు తెలిసే చేశారు.. మానస్ బయటపెట్టేశాడు!
Updated : Jan 2, 2022
సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్.. బిగ్ బాస్ సీజన్ 5లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వరుస హగ్గులు, కిస్ లతో వీరిద్దరు చేసిన హంగామా నెటిజన్ లతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా వెగటు పుట్టించడం తెలిసిందే. హౌస్ లోకి ప్రవేశించిన షణ్ణు వాళ్లమ్మ కొంచెం ఎక్కువవుతోందంటూ ఇండైరెక్ట్ గా చెప్పినా... హగ్గులు తనకు నచ్చడం లేదని సిరి తల్లి ఓపెన్ గానే పంచ్ లేసినా షణ్ణు, సిరి వారి మాటలని పట్టించుకోలేదు సరికదా తిరిగి అదే పని చేస్తూ మరింత రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారి వారిని అన్‌పాపులర్ చేసింది.
Also read:అంతమంది సెలబ్రిటీస్ వచ్చినా 'బిగ్ బాస్ 5 ఫినాలే' రేటింగ్ తక్కువే!
ఈ జంటపై వచ్చిన మీమ్స్, విమర్శలు ఏ బిగ్ బాస్ జంటపై రాలేదు. అయితే వీరి గురించి మానస్ తాజాగా ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. జెస్సీ ఎలిమినేట్ అయిన దగ్గరి నుంచే సిరి, షణ్ణు మధ్య దూరం తగ్గిందని, అప్పటి నుంచే ఇద్దరు ప్రతి విషయానికి కనెక్ట్ కావడం మొదలైందని చెప్పుకొచ్చాడు మానస్. అయితే వీరిద్దరి వ్యవహార శైలి చూసి సన్నీ 'ఒరేయ్ బయట వీరి గురించి చెడుగా అనుకుంటారు కదరా?' అని అనుమానం వ్యక్తం చేసేవాడని తెలిపాడు.
Also read:సుడిగాలి సుధీర్‌కు ఊహించని షాక్!
తామేం ఏం చేస్తున్నారో... ఎలా ప్రవర్తిస్తున్నారో షణ్ణు, సిరిలకు ముందే తెలుసని, వారు అడల్ట్స్‌అని, ఏది తప్పో ఏది ఒప్పో వారు గ్రహించగలరని చెప్పుకొచ్చాడు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ గురించి సిరి, షణ్ణులకు ముందే తెలుసని, తెలిసే అలా బిహేవ్ చేశారని మానస్ అన్నాడు. అయితే హగ్గులు ఇప్పుడు కామన్ అని, ఈ రోజుల్లో వీటిని ఆధారం చేసుకుని క్యారెక్టర్ ని డిసైడ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడు. హౌస్ లో జరిగింది వారికి తెలిసే జరిగిందని, ఆ విషయంలో వారిద్దరు పూర్తి క్లారిటీతో వున్నారని మానస్ అసలు విషయం బయటపెట్టాడు.