సంక్రాంతికి 'హీరో'గా వస్తోన్న అశోక్ గల్లా
on Jan 2, 2022

మేరుపర్వతం లాంటి 'ఆర్ఆర్ఆర్' మూవీ బరి నుంచి తప్పుకోవడంతో ఇదే అదనుగా కొన్ని చిన్న సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచేందుకు ముందుకు ఉరుకుతున్నాయి. వాటిలో ఒకటి.. అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతోన్న 'హీరో'. జనవరి 15న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అశోక్ గల్లా.. అమరరాజా బ్యాటరీస్ అధినేత, టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడు. 'హీరో' మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా, అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు.
Also read: 'కేజీఎఫ్' లైఫ్‌టైమ్ కలెక్షన్లను 13 రోజుల్లో దాటేసిన 'పుష్ప'!
అశోక్ గల్లాకు 'హీరో' మొదటి చిత్రమే అయినా ఎంతో మెచ్యూర్డ్ గా నటించినట్లు యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్‌లో ఇటు పర్ఫార్మెన్స్‌తో, అటు లుక్స్ తో అశోక్ గల్లా ఆకట్టుకున్నాడు. పవర్‌ఫుల్ రోల్‌లో 'హీరో'గా అతడిని మనం చూడబోతున్నామని అర్థమవుతోంది. అతడి సరసన నాయికగా ఫుల్ గ్లామరస్ రోల్‌లో నిధి అగర్వాల్ కనిపించనుంది.
Also read: బిగ్ షాక్.. 'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదా!
'భలే మంచి రోజు', 'శమంతకమణి', 'దేవదాస్' లాంటి సినిమాల తర్వాత శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన మూవీ.. 'హీరో'. సరికొత్త కథాంశంతో ఎంటర్టైనర్‌గా ఈ మూవీ ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. జనవరి 15న తాము ఆశించిన విజయం దక్కుతుందనే పూర్తి నమ్మకంతో ఉంది 'హీరో' టీమ్. ఈ మూవీలో జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య కీలక పాత్రధారులు.
కల్యాణ్ శంకర్, ఏఆర్ ఠాగూర్ డైలాగ్స్ రాసిన ఈ మూవీకి జిబ్రాన్ సంగీతం సమకూర్చగా, సమీర్‌రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్స్‌గా వర్క్ చేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



