English | Telugu
బాలయ్యా మజాకా.. రానాని ఆడేసుకున్నాడుగా!
Updated : Jan 3, 2022
`ఆహా` ఓటీటీ కోసం హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారిన విషయం తెలిసిందే. `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` పేరుతో స్ట్రీమింగ్ అవుతున్న టాక్ షో కు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎపిసోడ్ తో ఈ టాక్ షో మొదలైంది. అప్పటి నుంచి పేరుకు తగ్గట్టే అన్‌స్టాపబుల్ గా రన్నవుతూ ఎంటర్‌టైన్ చేస్తోంది. తాజాగా ఎమిదవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని `ఆహా` టీమ్ రిలీజ్ చేసింది.
ఈ ఎపిసోడ్ కి రానా దగ్గుబాటి గెస్ట్ గా రాబోతున్నారు. ప్రోమోలో బాలయ్య .. హీరో రానాని గట్టిగానే ఆడేసుకున్నట్టుగా కనిపిస్తోంది. షో లోకి ఎంట్రీ ఇచ్చిన రానా .. "నా షోలో బెస్ట్ ఎపిసోడ్ ప్రతీ సీజన్ లో మీదే" అనడం దానికి బాలయ్య "కొత్తగా ఏదైనా చెప్పు బాలకృష్ణ అంటేనే బెస్ట్" అని అనడం...`ఫస్ట్ టైమ్ బాలకృష్ణ టాక్ షో చేస్తున్నాడంటే నీకు ఏమనిపించింది?' అని రానాని బాలయ్య అడిగితే... "మేమంతా ట్రైన్ లో వస్తుంటే మీరు మాత్రం బుల్లెట్ ట్రైన్‌లో వచ్చారనిపించింది" అన్నాడు రానా.
Also read:"నేను ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉండను".. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
`లాక్‌డౌన్ టైమ్ లో వ్యాక్సిన్ వస్తుందనుకుంటే నీ పెళ్లి న్యూస్ వచ్చిందేంటయ్యా బాబూ'.. అని బాలయ్య అనడంతో అంతా గొల్లున నవ్వేశారు. ఇక మాటల్లోనే ఫోన్ తీసి, "రానా దగ్గుబాటి అని గూగుల్ చేస్తే.. నువ్వు ఎంత మందికి నో చెప్పావో.. ఎంత మందికి హ్యాండిచ్చావో గూగుల్ చెబుతుంది" అనేశాడు. వెంటనే రానా `అది ఊరికే సార్ కావాలని వాళ్లకు వాళ్లే రాసేసుకుంటారు` అనగానే ఆ మాటలకు బాలయ్య ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ అదిరింది.
Also read:'అఖండ' కలెక్షన్లను తట్టుకోలేక దిగాలుపడ్డ వ్యతిరేక వర్గం!
'అందగాడు గురించి రాస్తారులే.. ఆరడుగుల బుల్లెట్టు'.. అంటూ మరో పంచ్ పేల్చారు. అంతేనా ప్రోమో చివర్లో `కొంచెం బ్యాలెన్స్ వచ్చేసింది. అప్పట్లో పూలరంగడిలా తిరిగే వాడివి'.. అని బాలయ్య అనడంతో `ఓహో ఈ షో ఇలాగెలుతోందా?'.. అని రానా అనడం నవ్వులు పూయిస్తోంది. ఈ నెల 7న ఈ ఎపిసోడ్ `ఆహా`లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రోమోనే ఈ రేంజ్ లో వుంటే ఎపిసోడ్ రచ్చ రచ్చే అంటున్నారు.