English | Telugu

నాకు అత్తా, పిత్తా అని పిలిపించుకోవాలని లేదు!

సుమ తన యూట్యూబ్ ఛానల్ లో 'క్రేజీ కిచెన్' పేరుతో ఒక షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ షో కి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేసింది. అలాగే "ఈ షోకి వచ్చిన గెస్ట్ ఎవరు?" అంటూ ఒక రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో కూడా పోస్ట్ చేసింది.

ఐతే ఈ షోకి అనసూయను గెస్ట్ గా తీసుకొచ్చింది సుమ. రావడంతోనే అనసూయ "క్రేజీ కిచెన్ స్పెల్లింగ్ తప్పుంది కదా" అని అనేసరికి "ఇంగ్లీష్ భాషను తిరగేసి, మరగేసి అలా పెట్టాను" అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది సుమ. "చేసి పెడితే తింటుంది, వంట రాదు అన్నట్టుగా చూస్తారు నన్ను చాలా మంది. కానీ నాకు చాలా వంటలు వచ్చు అన్న విషయం ఈరోజు ఈ షో ద్వారా ప్రూవ్ చేస్తా" అంటూ చెప్పింది అనసూయ.

"అత్తాకోడళ్లంటే ఏ ఊర్లోనైనా ఒకేలా ఉంటారా.. లేదంటే బిహారీ అత్తకు, తెలుగు కోడలికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా?" అని సుమ వెరైటీగా అడిగింది. అనసూయ ఆన్సర్ కి మాత్రం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేసింది సుమ. తర్వాత వంట చేస్తూ "ట్విట్టర్ వార్ లోకి దిగాక నాకు తెలిసింది ఏమిటంటే నాకు అత్తా, పిత్తా అని పిలిపించుకోవాలని లేదు. స్టైల్ గా అనసూయ, అను అని పిలవాలి. నా కోడలైనా సరే అలాగే పిలవాలి" అంది అనసూయ.

"మరి నీకు ఎలా పిలిస్తే నచ్చుతుందో అది చెప్పేస్తే సరిపోతుంది.. అక్కడితో ఐపోతుంది కదా.. ఇదంతా ఎందుకు?" అన్నట్టుగా సుమ చెప్పేసరికి అనసూయ పగలబడి నవ్వేసింది.