English | Telugu
కంటెస్టెంట్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్!
Updated : Sep 22, 2022
బిగ్ బాస్ హౌస్‌లో పదిహేడవ రోజు "దేఖో దేఖో గబ్బర్ సింగ్" పాటతో మొదలైంది."అడవిని కాపాడుకోవడం పోలీసుల బాధ్యత గీతూ.. కేవలం దొంగలు దొంగతనం చేసినవి మాత్రమే కొనుక్కోవచ్చు. విఐపి బాల్కనీలోకి ఎవరూ కూడా గీతు అనుమతి లేకుండా ప్రవేశించకూడదు. ఒకవేళ ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారికి గీతు ఎటువంటి శిక్ష అయినా విధించవచ్చు" అని బిగ్ బాస్, కంటెస్టెంట్స్ కి చెప్పాడు.
"గేమ్ జరుగుతున్నప్పుడు బిగ్ బాస్, మీలో కొంతమందిని పదే పదే ఆపినప్పటికి, ఇంట్లో పైకెక్కడం చేస్తున్నారు. ఇది ఇంటి నియమాలకు వ్యతిరేకం మరియు మీ ప్రాణాలకు కూడా హానికరమైనది. ఒకవేళ హెచ్చరిక తర్వాత కూడా ఎవరైనా మళ్ళీ ఇలా చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది" అని బిగ్ బాస్, కంటెస్టెంట్స్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత టాస్క్ కొనసాగింది.
గీతు, రేవంత్, శ్రీహాన్, చంటి, ఆదిత్య, వాసంతి, ఇనయా, ఆరోహి ఈ వారం నామినేషన్లో ఉన్నారు.