English | Telugu
రోజా లేకపోతే మా లవ్ స్టోరీ స్క్రీన్ మీదకు వచ్చేది కాదు!
Updated : Sep 22, 2022
బుల్లితెర మీద ఈమధ్య రియాలిటీ షోస్ ఎక్కువయ్యాయి. వీటికి టీఆర్పీలు పెంచుకోవడానికి రీల్ లవ్ స్టోరీస్ ని వండి వడ్డిస్తున్నారు ఆడియన్స్ కి. అలాంటి ఒక రీల్ లవ్ స్టోరీ గురించి అనుకోగానే ముందుగా గుర్తొచ్చేది రష్మీ-సుధీర్ లవ్ స్టోరీ. ఐతే రీల్ లవ్ స్టోరీస్ మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటు రియల్ లవ్ స్టోరీస్ కూడా ఉంటాయని నిరూపించారు రాకేష్ అండ్ జోర్దార్ సుజాత.
మొదట్లో వీళ్ళ లవ్ స్టోరీ అందరిలాంటిదే అనుకున్నారంతా. కానీ 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టారు. వెంటనే సుజాతకు రింగ్ తొడిగి ప్రపోజ్ చేసి తమదినిజమైన ప్రేమ అని చెప్పాడు రాకేశ్. త్వరలోనే తామువివాహం చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించింది సుజాత. దీని గురించి తన యూట్యూబ్ చానెల్‌లో కూడా చెప్పింది. ఐతే వీళ్ళ ప్రేమ, పెళ్ళికి కారణం జబర్దస్త్ జడ్జి రోజా అని చెప్పింది సుజాత.
లేటెస్ట్ గా తన యూట్యూబ్ చానెల్‌లో రోజా హోమ్ టూర్ వీడియోను అప్‌లోడ్ చేసింది సుజాత. ఆ వీడియోలోతాను, రాకేష్ ప్రేమించుకుంటున్నాం అనే విషయాన్ని ముందుగా రోజా గుర్తించారని తెలిపింది సుజాత. తర్వాత ఆమె ఇద్దరితో మాట్లాడినట్టు చెప్పింది సుజాత. "రోజా గారు లేకపోతే మా విషయం స్క్రీన్ మీదకు వచ్చేది కాదు.. మా పెళ్లి అనౌన్స్మెంట్ కూడా ఇంత తొందరగా వచ్చేది కాదు. మా ప్రేమకు కారణం రోజాగారే" అని చెప్పింది సుజాత. జబర్దస్త్ లో మనో, రోజా, ఖుష్బూ అంటే ఇష్టమని చెప్పింది. త్వరలో మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యాక అనౌన్స్ చేస్తామని చెప్పింది.