English | Telugu

యాంక‌ర్ శ్రీ‌ముఖికి ఇప్ప‌టికే పెళ్లైందా?

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు శ్రీ‌ముఖి. త‌న‌దైన మార్కు యాంక‌రింగ్‌తో అల్ల‌రి చేష్ట‌ల‌తో.. ముద్దు ముద్దు మాట‌ల‌తో.. త‌న‌దైన అంద‌చందాల‌తో ఆక‌ట్టుకుంటూ బుల్లితెర `రాముల‌మ్మ‌`గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది శ్రీ‌ముఖి. ఏదైనా షోలో త‌న‌దైన మార్కు హంగామాతో అల‌రించే శ్రీ‌ముఖి వ‌రుస టీవీషోల్లో బిజీగా వుంటోంది. అంతే కాకుండా అదే స్థాయిలో సోష‌ల్ మీడియాలోనూ బిజీగా క‌నిపిస్తోంది. నిత్యం త‌న ఫొటో షూట్‌ల‌కు సంబంధించిన ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకుందోంది.

అంతే కాకుండా చిలిపి అల్ల‌రి వీడియోల‌తో పాటు త‌న‌కు న‌చ్చిన పాట‌ల‌కు చిందులేస్తున్న వీడియోల‌ని కూడా షేర్ చేస్తూ నిత్యం అభిమానుల‌తో ట‌చ్‌లో వుంటోంది. తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియోని పోస్ట్ చేసి షాకిచ్చింది శ్రీ‌ముఖి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న‌కు పెళ్లెప్పుడ‌వుతుందో తెలుసుకుందామ‌నే ఓ ఫ‌న్నీగేమ్‌ని ఆడింది. ఈ గేమ్‌లో భాగంగా నాకు పెళ్లెప్పుడ‌వుతుంద‌ని శ్రీ‌ముఖి అడ‌గ్గా .. మీకు ఇదివ‌ర‌కే పెళ్లైందంటూ స‌మాధానం వ‌చ్చింది.

ఆ స‌మాధానం చూసి షాక్ అయిన శ్రీ‌ముఖి తొక్క‌లే అంటూ రియాక్ష‌న్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్స్ శ్రీ‌ముఖిపై సెటైర్లు వేస్తున్నారు. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్ రాక్స్ శ్రీ‌ముఖి షాక్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజ‌న్ 4 త‌రువాత కొన్ని సినిమాల్లో మెరిసిన శ్రీ‌ముఖి ప్ర‌స్తుతం `స్టార్ మా` కోసం ఓంకార్ ప్రొడ్యూస్ చేస్తున్న `కామెడీ స్టార్స్‌`కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇటీవ‌ల సైమా అవార్డ్స్‌ ఫంక్ష‌న్‌లో హాట్ హాట్ అందాల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసి నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే.