English | Telugu

ఆహాలో "ఫామిలీ ధమాకా"...హోస్ట్ గా విశ్వక్ సేన్...

ఆహా ప్లాట్ఫార్మ్ పై కొత్త షో త్వరలో ఆడియన్స్ ని పలకరించబోతోంది. అదే "ఫామిలీ ధమాకా".. ఇక ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. సెప్టెంబర్ 8 నుంచి ప్రతీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ షో స్ట్రీమ్ కాబోతోంది. ఐతే ఈ షోకి ఫస్ట్ టైం హోస్ట్ గా మన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వచ్చేసాడు. ఈ షోలో కొన్ని జనరల్ ఫామిలీస్ ని ఇన్వైట్ చేసి గేమ్ షో ఆడించాడు అందులో ఒక ఫామిలీని ఒక ప్రశ్న వేసాడు "తక్కువ బట్టలేసుకునే పబ్లిక్ ప్లేస్ ఏమిటి" అని అడిగేసరికి ఒక పెద్దాయన "గోవాలో తక్కువ బట్టలు వేసుకోవడం చూసాం..తగ్గేదేలే" అని ఆన్సర్ ఇచ్చేసరికి "అల్లు అర్జున్ గారు కూడా తగ్గేదేలే అనే పదం అన్ని సార్లు అనుండరు అనేసరికి మిమ్మల్ని చూస్తుంటే మూడ్ వస్తోందంటూ" కౌంటర్ వేశారు ఆ పెద్దాయన. "నన్ను చూస్తే మూడ్ రావడం ఏమిటా అని" రివర్స్ లో అడిగాడు మాస్ కా దాస్. తర్వాత కొంతమంది ఫేమస్ సింగర్స్ తో లడ్డులు తినిపిస్తూ పాటలు పాడించాడు. ఆ తర్వాత ఒక లేడీని "విశ్వక్ సేన్ ఎలా ఉంటాడు" అనేసరికి "మహేష్ బాబు బాగుంటాడు" అని చెప్పింది. ఇలా రాబోయే ఎపిసోడ్ ప్రోమోస్ ని బిట్స్ గా చూపించారు.. ఫైనల్ గా "ఫామిలీ ధమాకా...

ఇది దాస్ కా ఇలాకా" అంటూ ఎండింగ్ చెప్పాడు విశ్వక్ సేన్. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్సేన్. విశ్వక్సేన్ మూవీస్ బాగా ఎంటర్టైన్ చేస్తాయి. కేవలం ఒక జానర్ మూవీస్ కె పరిమితం కాకుండా అన్ని రకాల మూవీస్ ని ఎంపిక చేసుకుంటాడు. ప్రేమ కథ చిత్రాలతో పాటు మాస్ మసాలా సినిమాలు కూడా చేస్తున్నాడు. పాగల్, అశోక వనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా.. లాంటి మూవీస్ ఒక ట్రెండ్ ని సెట్ చేశాయి. ఫలక్ నుమదాస్, దాస్ కా ధమ్మీ, ముఖచిత్రం, హిట్ లాంటి డిఫరెంట్ యాంగిల్ లో కనిపించే మూవీస్ లో కూడా నటించి తన సత్తా చాటాడు. ఇక ఇప్పుడు ఆహా ఓటిటి ప్లాట్ఫార్మ్ పైకి హోస్ట్ గా ప్రతీ వారం అలరించడానికి వచ్చేస్తున్నాడు.