English | Telugu

హ్యాపీ బర్త్ డే రా ఎర్రిపప్ప...వెరైటీగా విష్ చేసిన షన్ను


బుల్లితెర మీద సోషల్ మీడియాలో షన్ను, జెస్సి తెలియని వారంటూ ఎవరూ లేరు. నిన్న జెస్సి బర్త్ డే సందర్భంగా షన్ను సడెన్‌గా కేకు పట్టుకొచ్చి జెస్సికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కేక్ పట్టుకురావడం వరకు ఓకే కానీ ...కేకు మీద ఎవరైనా పేర్లు రాయిస్తారు కానీ ఇక్కడ వెరైటీగా ఎర్రిపప్ప అని రాయించాడు షన్ను. "హ్యాపీ బర్త్ డే రా ఎర్రిపప్ప.. మనం కలిసాక ఇది ఫస్ట్ బర్త్ డే కదా.. హౌస్‌లో ఇద్దరం దొరికాంరా మనం ఒకరికి ఒకరు. పద నామినేషన్‌కి వెళ్దామా.. ఇంకా బిగ్‌బాస్‌లోనే ఉన్నావ్ కదా.. బయటికి రారా.." అంటూ జెస్సీని హగ్ చేసుకుని కేక్ కట్ చేయించాడు షన్ను. "తినండి.. షన్ను ప్రేమగా తెచ్చిన కేకు మీ కోసం.." అంటూ నెటిజన్స్ కి కూడా ఒక కేక్ పీస్ పెట్టాడు జెస్సీ.

ఇలా వాళ్లిద్దరూ సరదాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు జెస్సీ.. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మీరు ఇద్దరూ కలిశారు ఓకే కానీ మరి సిరి ఎక్కడ.. వి వాంట్ సిరి , సిరి ఉంటే చాలా బాగుండేది అంటూ కామెంట్లు పెడుతున్నారు. జెస్సీ బర్త్‌డేకి సిరి ఎందుకు రాలేదంటూ జెస్సీని అడుగుతున్నారు. నిజానికి హౌస్‌లో ఉన్నప్పుడు సిరి-షన్ను- జెస్సీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. కానీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి. అందుకే ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కూడా చేసేసుకున్నారు. దీని గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జెస్సీ రియాక్ట్ అయ్యాడు. "వాళ్లు నన్ను ఎందుకు దూరం పెట్టారో నాకు తెలీదు కానీ.. నేనైతే వాళ్లను ఇప్పటికీ ఫ్రెండ్స్‌లానే చూస్తున్నానని" అంటూ ఎమోషనల్ అయ్యాడు జెస్సి. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్దిరోజులకి జెస్సీని సిరి కలిసింది. కానీ షన్ను మాత్రం రాలేదు. ఇప్పుడు కూడా షన్ను-జెస్సీ కలిశారు కానీ సిరి రాలేదు. మరి సిరి వస్తుందా వీళ్ళ ముగ్గురు మళ్ళీ కలుస్తారా..చూద్దాం.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.