English | Telugu

రాఘవ లారెన్స్ ని ఇంటర్వ్యూ చేసిన విక్రమ్-నందిని

రాఘవ లారెన్స్ ని ఇంటర్వ్యూ చేసిన విక్రమ్-నందిని


చంద్రముఖి 2 మూవీ రిలీజ్ అయ్యి దుమ్ము రేపుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వాసుని హీరో రాఘవ లారెన్స్ ని ఇంటర్వ్యూ చేశారు శ్రీవాణి భర్త విక్రమ్ ఆమె కూతురు నందు. "ప్రభుదేవా డాన్స్ చేసేటప్పుడు వచ్చే ఆ కిక్కే వేరు..ప్రభుదేవాని చూసినప్పుడు మన సౌత్ ఇండియన్ అనే ఒక గర్వంగా ఉంటుంది ఆ తర్వాత రాఘవ లారెన్స్ వచ్చి డాన్స్ చేయడం స్టార్ట్ చేసాక..ఇంటికొక డాన్సర్  తయారయ్యారు.

ఇంటికొక డాన్సర్ ని తయారు చేసింది మాత్రం రాఘవ లారెన్స్" అని చెప్పి సెట్ కి వెళ్లి లారెన్స్ ని ఇంటర్వ్యూ చేశారు విక్రమ్. "వాసు డైరెక్షన్ లోనే శివలింగ కూడా చేశారు కదా అది సూపర్ హిట్ మరి శివలింగ 2 తియ్యకుండా చంద్రముఖి 2 తీశారు...రజనీకాంత్ నటించిన మూవీ సీక్వెల్ లో నటించడం ఎలా అనిపిస్తోంది".."మూవీ బిజినెస్ అవుతుంది కదా అందుకే..అలాగే రజనీకాంత్ నటించిన మూవీ సీక్వెల్ లో నటించడం హ్యాపీగా ఉంది.

రజనీకాంత్ గారిలా చేయగలుగుతామా అని అనుకున్నా కానీ చేసాక..హ్యాపీగా అనిపించింది నేను కూడా చేయగలను అనుకున్నాను" అని చెప్పారు లారెన్స్. "మీరు కూడా డైరెక్టర్ కదా మరి వాసు గారి డైరెక్షన్ లో ఎలా చేశారు" అని నందు అడిగింది. "నేను డైరెక్టర్ అన్న విషయం మర్చిపోతేనే ఇక్కడ హీరోగా చేయగలను...ఇందులో కామెడీ ఉంది..వడివేలు గారి కామెడీ చాలా బాగుంటుంది. అలాగే వాసు గారి స్టయిల్లో మాస్ సాంగ్స్ కూడా ఉన్నాయి" అని చెప్పారు లారెన్స్. శ్రీవాణి ఫామిలీ మొత్తం కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలాగే బుల్లితెర మీద అన్ని షోస్ లో కనిపిస్తూ ఉంటారు. రీసెంట్ గా నీతోనే డాన్స్ ఎపిసోడ్ లో మెరిశారు. వీళ్ళు చేసే డాన్స్ కి చాలామంది ఫాన్స్ కూడా ఉన్నారు.