English | Telugu
చీర పెట్టిన వియ్యపురాలు..గొడవ పెట్టిన కోడలు
Updated : Sep 29, 2023
సన... బుల్లితెర నటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు సీరియల్స్ లో నటిస్తూ ఉంటుంది ఇటు సిల్వర్ స్క్రీన్ మీద రకరకాల సైడ్ క్యారెక్టర్స్ లో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సన ఇప్పుడు తన అపార్ట్మెంట్ లో జరిగే వినాయక చవితి వేడుకల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నట్టు ఒక వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసింది.
అందులో తన వియ్యపురాలు కూడా ఈ ప్రోగ్రాంకి రావడాన్ని చూపించారు. అలాగే పిల్లలను ఇచ్చిన వియ్యపురాలు వచ్చి సనకి గిఫ్టులు ఇచ్చారు. అలాగే ఒక మంచి చీర దాంతో పాటు 1000 రూపాయలు కూడా ఇచ్చారు. ఇక సన ఆ చీరను చూసి మురిసిపోయింది. ఆ కలర్ తన దగ్గర లేదని చెప్పింది. ఇక వాళ్ళ అపార్ట్మెంట్ లో పెట్టిన షాపింగ్ మాల్ ని అందరూ చూసారు. అలాగే గంటలతో తయారు చేసిన వినాయకుడిని కూడా చూపించింది సన.
ఇక సన ఇంటికి చాలా మంది చుట్టాలు వచ్చి రకరకాల వంటలు చేశారు..ఇక కోడలు సమీరా, కూతురు తబుస్సామ్ ఇద్దరూ తిని చూపించారు. అలాగే చీటికీ మాటికీ అత్తగారు సనతో గోడపాడుతూనే ఉంది కోడలు సమీరా. అలాగే కూతురు, కోడలు చానెల్స్ ని సబ్స్క్రయిబ్ చేసుకోమని తన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకుంది సన..సనా కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. సనాకి హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. కానీ అక్కడ పరిస్థితులు నచ్చక, అలాగే హీరోయిన్ కావాలంటే స్విమ్ సూట్ లో కనిపించాలి, బాగా ఎక్స్ పోజ్ చేయాలి అనేసరికి ఆ ఆఫర్స్ ని వదులుకుంది సన. ఆమె `మెట్రో కథలు` వెబ్ సిరీస్ లో రొమాంటిక్ రోల్ లో కనిపించేసరికి అందరూ షాకైపోయారు. సహ నటుడు అలీ రెజాతో కలిసి రొమాంటిక్ సీన్స్ లో యాక్ట్ చేసి తన ఫాన్స్ కి షాకిచ్చారు.