English | Telugu
బీచ్ లో బిగ్ బాస్ బ్యూటీ.. సో హాట్ అంటున్న నెటిజన్లు!
Updated : Sep 29, 2023
బిగ్ బాస్ బ్యూటీ అందాల ఆరబోత మళ్ళీ షురు చేసింది. అప్పట్లో టూర్స్ అంటు తిరిగి మళ్ళీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటూ ప్రజలను చైతన్యవంతులను చెయ్యడంలో నిమగ్నం అయింది. తనెవరో కాదు బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్ ఇనయా సుల్తానా.. ఒక ఫైర్ బ్రాండ్, లేడీ టైగర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అమ్మడు గురించి పెద్ద లిస్టే ఉంది. బిగ్ బాస్ తర్వాత మంచి ఫేమ్ సంపాదించి సెలబ్రిటీ రేంజ్ ని పొందింది. సోషల్ మీడియా అంతా నాదే అన్నట్లుగా పోస్ట్ లతో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది ఇనయా. ఆమె ఏం చేసిన ట్రెండింగ్ లోకి వెళ్తుంది. అంతలా ఇన్ స్టాగ్రామ్ లో ఫేమస్ అయింది ఇనయా. ప్రతీదానిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పే ఇనయాని ఇన్ స్పిరేషన్ గా తీసుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్-6 ముందు వరకు ఈ పేరు ఇనయా గురించి పెద్దగా ఎవరికి తెలియదనే చెప్పాలి. కానీ బిగ్ బాస్ సీజన్-6 తో ఫుల్ ఫేమస్ అయింది. రామ్ గోపాల్ వర్మతో చిందులు వేసిన వీడియో వైరల్ అయి సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకొని, బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. లేడీ టైగర్ అంటూ బిగ్ బాస్ హౌజ్ లో చేసిన రచ్చ అంత ఇంతా కాదు. హౌజ్ లో ఎక్కువగా గొడవలకు ఇంపార్టెన్స్ ఇస్తూ అందరి చూపు తన వైపు తిప్పుకుంది ఇనయా. హౌజ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎక్కువ ప్రేక్షకులను సంపాదించుకుంది.
ఇనయా రెగ్యులర్ గా దుబాయ్ , మలేషియా అంటూ టూర్స్ కి వెళ్తూ వ్లాగ్స్ చేస్తూ తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తుంది. అయితే ఎక్కడికి వెళ్ళిన తన అందాలా ఆరబోత ఆపట్లేదు ఈ అమ్మడు. కుర్రాళ్ళ దృష్టిలో పడాలని తను పడే తపన అంతా ఇంతా కాదు. మీరు మరీ ఇంత బోల్ట్ ఫోటోలు ఎందుకు పెడతారని ఒక నెటిజన్ ఆ మధ్య అడుగగా.. అది నా పర్సనల్, నాకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటానని చెప్పింది ఈ బ్యూటీ. "జవాన్" సినిమాలోని 'రామయ్యా వస్తావయ్యా' పాటకి కెవ్వు కార్తిక్ తో కలిసి చిందులేసింది ఇనయా. అయితే తాజాగా మలేషియాకి వెళ్ళి వచ్చింది ఇనయా. అక్కడ తను దిగిన కొన్ని ఫోటోలని ఇప్పుడు అప్లోడ్ చేసింది. అందులో అందాల ఆరబోత కాస్త మితిమీరిందనే చెప్పాలి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.