English | Telugu
వేద..యష్ కి అండగా నిలుస్తుందా?
Updated : Jan 4, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా బెంగళూరు పద్మ, ప్రణయ్ హనుమాండ్ల, ఆనంద్, శ్రీధర్ జీడిగుంట కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బేబీ మిన్ను, నైనిక చుట్టూ తిరిగే కథగా రూపొందుతున్న ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మంగళవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారబోతోంది. కోర్టులో యశోధర్, మాళవికకు విడాకులు మంజూరవుతాయి.
అయితే ఈ క్రమంలో వారి పాప ఖుషీ ఎవరి వద్ద వుండాలన్నది ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ నేపథ్యంలో పాపనే తేల్చుకోమందామని నిర్ణయించిన న్యాయమూర్తి ఖుషీని తీసుకురమ్మంటుంది. నువ్వు ఎవరి దగ్గర వుండాలనుకుంటున్నావు, నీకు ఎవరు కావాలని అడిగితే వేద కావాలని, తాను ఆమె దగ్గరే వుంటానని చెబుతుంది. అప్పటి నుంచి వేదని బుట్టలో వేసుకోవాలని మాళవిక, ఆమె ప్రియుడు అభిమన్యు ప్లాన్ లు వేస్తుంటారు.
Also Read:ఎన్నెన్నో జన్మల బంధం: యశోధర్‌కు వేద షాకిస్తుందా?
ఈ విషయం తెలిసి యష్ తల్లి మాలిని తన కూతురితో కలిసి ప్రయత్నాలు మొదలుపెడుతుంది. వేదని తమ వైపు తిప్పుకుని ఖుషీని సొంతం చేసుకోవాలని ప్రయత్నించడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో కడుపునొప్పి నాటకం ఆడుతుంది. ఆ నాటకాన్ని వేద తల్లి పసిగట్టడం.. అదే సమయానికి వేద ఇంటికి మాళవిక రావడంతో మాలిని పెద్ద గొడవ చేస్తుంది.. ఈ క్రమంలో మాలిని కత్తితో మాళవికపై దాడికి దిగుతుంది.. ఈ పెనుగులాటలో వేదకు గాయమవుతుంది. ఇది గమనించిన యష్ తల్లిని మందలించి అక్కడి నుంచి వెళ్లిపొమ్మంటాడు.
Also Read:యష్, మాళవికలకు షాకిచ్చిన ఖుషీ
ఆ తరువాత ఏం జరిగింది? మాలిని, అభిమన్యుల పన్నాగాన్ని వేద పసిగడుతుందా?.. కేవలం ఖుషీని, మాళవికని అడ్డుపెట్టుకుని యశోధర్ ని దెబ్బతీయాలని ప్లాన్ వేస్తున్న అభిమన్యు.. ఎలాంటి ప్లాన్ వేశాడు?.. ఆ ప్లానేంటీ?.. ఈ క్రమంలో వేద .. యష్ కి అండగా నిలిచిందా? .. అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.