యష్, మాళవికలకు షాకిచ్చిన ఖుషీ
on Dec 31, 2021

బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా `స్టార్ మా`లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ అనూహ్య మలుపులతో సాగుతూ ఆకట్టుకుంటోంది. కీలక పాత్రల్లో కొత్త నటీనటులు నటించిన ఈ సీరియల్ ఈ శుక్రవారం ఆసక్తికర మలుపుకు శ్రీకారం చుట్టబోతోంది. విడాకుల కోసం యష్ అతని మాజీ భార్య మాళవిక కోర్టుని ఆశ్రయిస్తారు.
ఈ నేఫథ్యంలో ఖుషీ కావాలంటే విడాకులకు అంగీకరించాలని యష్‌కు మాళవిక ప్రియుడు అభిమన్యు షరతు పెడతాడు. తన పాప కోసం ఇష్టం లేకపోయినా విడాకులకు ఓకే చెబుతాడు యష్.. అయితే కోర్టులో తనకు విడాకులు ఇష్టమేనని యష్ చెప్పిన తరువాత కోర్టు ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తుంది. అయితే ఇదే క్రమంలో యష్ ని పాప ఎవరి వద్ద వుండాలని భావిస్తున్నారని న్యాయమూర్తి అడుగుతారు. అయితే పాప తనకే కావాలని యష్ బదులిస్తే అనూహ్యంగా మాళవిక కూడా తనకే పాప కావాలంటుంది.
Also Read: 'బాహుబలి' భామకు కరోనా!
ఊహించని షాక్ లో వున్న యష్ ని చూసి అభిమన్యు వెటకారంగా చూస్తూ గొర్రె కసాయివాడినే నమ్ముతుంది యశోధర్.. నేను తడి గుడ్డతో గొంతులు కోసే రకం.. అది తెలిసి నన్ను నమ్మడం నీ అమాయకత్వం అని తన చూపుల్తోనే చెప్పేస్తాడు. తనని మరోసారి అభిమన్యు మోసం చేశాడని రగిలిపోతాడు యష్. ఇంతలో జడ్జి పాప ఎవరి దగ్గర వుండాలో పాపనే అడుగుదామని, పాపని తీసుకురండని చెబుతుంది... కోర్టు హాలు లోకి ప్రవేశించిన ఖుషీ తనకు డాక్టర్ వేద కావాలని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఆ తరువాత ఏం జరిగింది? .. కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



