ఎన్నెన్నో జన్మల బంధం: యశోధర్‌కు వేద షాకిస్తుందా?
on Dec 28, 2021

బుల్లితెరపై మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సరికొత్త సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. పరభాషా నటులు నిరంజన్, డెబ్‌జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు. బెంగళూరు పద్మ, ప్రణయ్ హనుమండ్ల, మిన్ను నిహారిక, ఆనంద్, శ్రీధర్ జీడిగుంట కీలక పాత్రల్ని పోషించారు. గత కొన్ని వారాలుగా విజయవంతంగా సాగుతున్న ఈ సీరియల్ ఆసక్తికరమైన మలుపులతో ఆకట్టుకుంటోంది. డాక్టర్ వేదని బుట్టలో వేసుకుని ఎలాగైనా ఖుషీని తమవైపు తిప్పుకోవాలని అభిమన్యు, యష్ మాజీ భార్య మాళివిక విశ్వప్రయత్నాలు చేస్తుంటారు.
యష్ విడాకులకు ఎలాంటి అడ్డు చెప్పకుంటే నీ కూతురుని నీకు ఇచ్చేస్తానని అభిమన్యు .. యష్‌కి ఆఫర్ ఇస్తాడు. అయినా యష్ ఆ ఆఫర్ ని అంగీకరించడు. ఈ క్రమంలో డాక్టర్ వేదని బుట్టలో వేయాలని అభిమన్యు, మాళవిక ట్రై చేస్తారు. ఈ క్రమంలో ఆమెకు డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తారు. అందుకు వేద తిరస్కరిస్తుంది. అయితే కోర్టుకు వచ్చిన తమ తరపున నిలబడమని.. వేదని కోరతారు అభిమన్యు, మాళవిక. అందుకు తనకు టైమ్ కావాలంటుంది వేద. దీంతో తనని కోర్టుకు అయినా రప్పించాలని, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పించి యష్ ని ఇరికించాలని ప్లాన్ చేస్తారు.
Also Read: దీప్తి హింట్ ఇచ్చిన వీడియో వైరల్!
అయితే బుధవారం ఎపిసోడ్ మరింత ఆసక్తిగా మారబోతోంది. కోర్టులో కథ కీలక మలుపు తిరగబోతోంది. కోర్టులో యష్, మాళవికల విడాకుల కేసు హియరింగ్ మొదలవుతుంది ఈ నేపథ్యంలో పాప ఖుషీని తీసుకురమ్మంటారు. పాపని తీసుకొస్తూ `ఎవరు ఎన్ని అడిగినా మమ్మీ మాత్రమే కావాలని చెప్పమని` మాళవిక ఖుషీకి చెబుతుంది. కానీ ఖుషీ ఏమీ మాట్లాడదు. అదే సమయంలో బోన్‌లోకి వచ్చిన వేద తను ఖుషీకి ఏమీ కానని, అయితే తనకు అన్నీ ఖుషీనే అని చెబుతూ ఈ వయసులో తల్లి కావాలా? తండ్రి కావాలా? అంటే ఈ పసి హృదయం ఇద్దరు కావాలంటుందని ఎమోషనల్ అవుతుంది.
Also Read: సిరి ఇప్పటికైనా కళ్లు తెరిచిందా?
ఇద్దరు పంతాలకు పోయి పసి హృదయాన్ని గాయపరుస్తున్నారని యష్, మాళవికలని నిలదీస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? .. ఖుషీ.. యష్ ని చేరిందా? .. లేక అభిమన్యు పన్నిన కుట్ర కారణంగా మాళవికకే దక్కిందా?.. యష్ పై కోపంతో కోర్టుకి వచ్చిన వేద ..యష్ కి చేసింది ఏంటీ? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



