English | Telugu

`ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`: మీడియా ముందు య‌ష్‌ని బుక్ చేసిన వేద‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ మంగ‌ళ‌వారం స‌రికొత్త ట్విస్ట్‌ల‌తో.. షాకింగ్ స‌న్నివేశాల‌తో స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతోంది. య‌ష్‌ని పెళ్లి చేసుకోవ‌డానికి వ‌చ్చిన వ్య‌క్తితో ప్ర‌త్యేకంగా మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తాడు య‌ష్‌. వేద‌ని బాగా చూసుకోవాల‌ని, ఈ విష‌యం మ‌నిద్ద‌రి మ‌ధ్యే వుండాల‌ని చెబుతాడు. ఇదిలా వుంటే ఈ విష‌యం తెలియ‌ని వేద పెళ్లిని ప‌క్క‌న పెట్టి ఓ అమ్మాయిని ద‌త్త‌త తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడుతుంది.

ఇందు కోసం ఓ అనాథాశ్ర‌మం వారిని సంప్ర‌దిస్తుంది. అయితే పోలీస్ కేసు అయిన విష‌యం తెలిసి కేసు వాప‌స్ తీసుకున్న వివ‌రాలు తెలియ‌జేస్తేనే పాప‌ని ద‌త్త‌త ఇస్తామ‌ని కండీష‌న్ పెడ‌తారు. దీంతో వేద.. య‌ష్‌ని క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. య‌ష్‌ని, అత‌ని వ్యాపారాన్ని దెబ్బ‌తీయాల‌ని ప్లాన్ చేసిన య‌ష్ మాజీ భార్య, ఆమె ప్రియుడు మీడియా ముందు య‌ష్‌ని బుక్ చేయాల‌ని ప్లాన్ చేస్తారు. అది గ‌మ‌నించ‌ని య‌ష్ మీడియా స‌మావేశం అన‌గానే వెంట‌నే అక్క‌డికి వెళ్లి మీడియాతో మాట్లాడ‌టం మొద‌లుపెడ‌తాడు.

ముందు చేసుకున్న ప్లాన్ ప్ర‌కారం మీడియా వారితో య‌ష్‌ని రెచ్చ‌గెట్టించే ప్ర‌శ్న‌లు వేయిస్తూ అత‌ని స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తుంటారు. ఇదే స‌మ‌యంలో అక్క‌డికి చేరుకున్న వేద మీడియా స‌మావేశం జ‌రుగుతుండ‌గానే య‌ష్‌ని నువ్వు గుడ్ ఫాద‌ర్‌వి కాదంటుంది. `న‌న్ను మిస్ అండ‌స్టాండింగ్ చేసుకుంటున్నారు మీరు` అని య‌ష్ అంటే `తండ్రి స్థానానికే ఒక క‌లంకం మీరు` అని వేద షాకిస్తుంది. అంతే కాకుండా సీఈఓగా మీరు హీరో అయ్యుండొచ్చు కానీ ఒక ఫాద‌ర్‌గా మాత్రం మీరు జీరో` అంటుంది వేద. ఇదంతా టీవీలో చూస్తున్న య‌ష్ త‌ల్లి ... వేద త‌ల్లిదండ్రుల్ని నిల‌దీస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. య‌ష్.. వేద‌ల క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది.. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.