English | Telugu
శైలేంద్రకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వసుధార.. ట్విస్ట్ మాములుగా లేదుగా!
Updated : Oct 11, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -890 లో....మహేంద్ర తాగిపడిపోయి ఉంటే అతని దగ్గరికి రిషి వసుధార వస్తారు. మహేంద్రని ఆ సిచువేషన్ లో చూసి రిషి, వసుధారలు బాధపడతారు. డాడ్ వెళదాం పద అని రిషి అనగానే.. నేను రాను జగతి ఎప్పుడు నా పక్కనే ఉండేది. ఇప్పుడు నా పక్కన లేదు. నేను రాను ఇక్కడే ఉంటానని మహేంద్ర మొండిగా ఉంటాడు. వసుధార, రిషి ఇద్దరు రిక్వెస్ట్ చేసి మహేంద్రని అక్కడ నుండి తీసుకోని వెళ్తారు.
ఆ తర్వాత మహేంద్రని ఇంట్లోకి తీసుకోనీ వెళ్తుంటే.. వద్దు ఈ ఇంట్లో నాకు ఉండాలని లేదు అని మహేంద్ర గట్టిగా అరుస్తుంటే.. ఇంట్లో ఉన్న అందరు హాల్లోకి వస్తారు.. ఏమైంది మహేంద్ర అని ఫణింద్ర అడుగుతాడు. సారీ అన్నయ్య అంటూ మహేంద్ర అంటాడు. అసలు ఏమైంది నీకు రోజు ఇలానే తాగి ఇంటికి వస్తావా అని దేవయాని అనగానే.. నా తమ్ముడు తాగుబోతేం కాదు. నువ్వు ఎందుకు అలా మాట్లాడుతూనావని దేవయాని పై ఫణింద్ర సీరియస్ అవుతాడు. మీ తమ్ముడు తాగి వస్తే అతనికి చెప్పకుండా నన్ను అంటున్నారేంటని దేవయాని అనగానే.. నీ బోడి సలహాలు ఏం అవసరం లేదు సైలెంట్ గా ఉండమని ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత మహేంద్రని గదిలోకి తీసుకొని రిషి, వసుధారలు వెళ్తారు. మళ్ళీ మహేంద్ర తాగబోతుంటే రిషి ఆపుతాడు. నువ్వు కూడా తాగు నీక్కూడా బాధ ఉంది కదా అని రిషికి బలవంతంగా మహేంద్ర డ్రింక్ ఇవ్వబోతుంటే.. సార్ వద్దు అని వసుధార అంటుంది. రిషి జెంటిల్ మెన్ కదా తాగొద్దు అంటాడు ఆ తర్వాత మళ్ళీ దేవయాని ఫణింద్ర ఇద్దరు వస్తారు. నువ్వు ఏం చేస్తున్నావ్ మహేంద్ర అని దేవయాని కోప్పడుతుంది.
ఆ తర్వాత ఇక చాలు వదిన గారు అని దేవయానికి మహేంద్ర నమస్కారం చేస్తాడు. ఏంటి అంత నేనే చేసినట్టు మాట్లాడుతూన్నావని దేవయాని అంటుంది. అవును అంత మేరే చేశారు. నాది నాకు కాకుండా చేశారని మహేంద్ర అంటాడు. దేవయాని ఇక్కడ నుండి వెళ్ళని తనకి ఫణింద్ర, రిషి చెప్తారు. మరుసటి రోజు ఉదయం అందరు హాల్లో కూర్చొని ఎండీ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలో ఆలోచిస్తుంటారు. నువ్వే ఆ చైర్ లో కూర్చొవాలని రిషికి ఫణీంద్ర చెప్తాడు.. లేదు నేను ఉండనని రిషి అంటాడు.. ఇక కాలేజీ లో జరిగిన దాని గురించి మర్చిపోండి. మీరు దాని గురించి ఏం ఆలోచించకండి. నేను ఫణింద్ర సర్ వెళ్లి మంత్రి గారితో SI తో మాట్లాడామని వసుధార చెప్పగానే.. దేవయాని, శైలేంద్ర ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే