English | Telugu

ముద్దు పెట్టేసుకున్న పండు...షాకైన సుమ

సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. "ది హండ్రెడ్ " మూవీ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ షోకి ఒకప్పుడు బుల్లితెర సీరియల్స్ లో పోలీస్ క్యారెక్టర్స్ తో యాంగ్రీ యంగ్ పోలీస్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే నాయుడు అలియాస్ సాగర్, కొరియోగ్రాఫర్ పండు, ధన్య బాలకృష్ణ, మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గిరిధర్ వచ్చారు. "మూవీ ఎలా ఉంటుంది" అని సుమ అడిగేసరికి "యాక్షన్ మూవీ..కుర్చీ మడతేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది" అని సాగర్ చెప్పేసరికి "లేదు లేదు మాకు మూవీ చూడాలని ఉంది" అని సాగర్ కామెంట్స్ ని మధ్యలోనే కట్ చేసింది. ఇక పండును చూపిస్తూ "ఇతను పండు కదా మీరు కొట్టే దెబ్బలకు ఇతను పండాలి" అనేసరికి అందరూ నవ్వేశారు.

" నేను సమయాన్ని..నేను ఎవరి కోసమూ ఆగను" అంటూ సుమ భారీ డైలాగ్ చెప్తుండగా పండు మధ్యలో వచ్చి "అరె అసిస్టెంట్ ఈ వాచ్ తీసుకెళ్ళు..టైం ఉందట ఇక్కడ" అని కౌంటర్ జోక్ వేసేసరికి సుమ షాకయ్యింది. తర్వాత తాను విలన్ అని హీరోయిన్‌ ధన్యను ఎత్తుకెళ్లిపోయే సీన్ చేశాడు పండు. తర్వాత ధన్య చేయి పట్టుకొని బుగ్గ గిల్లి "భలే ఉన్నావ్" అంటూ ముద్దు పెట్టుకున్నాడు పండు. దాంతో ధన్య తెల్లముఖం పెట్టింది. "ఆ అమ్మాయిని పట్టుకొని ముద్దు పెట్టుకుంటావా నీకెవడు ఇచ్చాడు అసలు సీన్" అంటూ సుమ అడిగేసరికి " ఆవిడే ఇస్తోంది" అంటూ సాగర్ కౌంటర్ ఇచ్చాడు.

"ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది...చాలామంది అబ్బాయిల వెనక అమ్మాయిలు ఉంటారు..కానీ నీ వెనక నేనుంటాను" అని ధన్య బాలకృష్ణ డైలాగ్ చెప్పేసరికి పండు తెగ సిగ్గుపడిపోయాడు. ఇక ఈ మూవీలో సాగర్ ని చూసేసరికి నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. "మళ్లి మొగలిరేకులు ప్రకంపనలు వస్తున్నట్టుగా ఉన్నాయి" అంటున్నారు. ఇక పండు ఫాన్స్ ఐతే ఫైర్ ఎమోజిస్ పెట్టారు. ‘షాదీ ముబారక్’ ద్వారా సాగర్ రీలాంచ్ అయ్యారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.