English | Telugu

లెటర్ తో ప్రపోజ్ చేసిన  మురారి.. ఇక అన్నీ మంచి శకునాలే!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -290 లో.. కృష్ణ ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది. కృష్ణ ఎక్కడికి వెళ్లాలో తెలియక హాస్పిటల్ కి వెళ్లి బాధపడుతుంటుంది. మురారి కృష్ణకీ ఒక లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్ లో ఏం ఉంటుందంటే.. గతంలో ముకుంద ప్రేమ గురించి, ప్రస్తుతం కృష్ణని ప్రేమిస్తున్న విషయం లెటర్ లో రాస్తాడు మురారి. అది చదివిన కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత లెటర్ లో మురారి రాసింది చూసి కృష్ణ మురిసిపోతుంది. అప్పుడే కృష్ణ దగ్గరికి రేవతి వస్తుంది. కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుండడం చూసి.. ఏమైందని అడుగుతుంది. కృష్ణ లెటర్ ఇస్తుంది. అది రేవతి చదివి సంతోషపడుతుంది. ఇద్దరు హ్యాపీగా కలిసి ఉండండని కృష్ణకి రేవతి చెప్తుంది. మీరిద్దరు కలిసి అక్క ముందుకు రండి. అక్క మిమ్మల్ని అర్థం చేసుకుంటుందని కృష్ణకు రేవతి చెప్తుంది. మరొక వైపు నేను అనుకున్నది జరిగిందని ముకుంద అనుకుంటుంది. అప్పుడే రేవతి అటుగా నవ్వుతు వెళ్తు కన్పిస్తుంది.. ఏంటి తనకు ఇష్టమైన కోడలు ఇంట్లో నుండి బయటకు వెళ్ళింది. మరి రేవతి అత్తయ్య ఎందుకు హ్యాపీగా ఉందని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ముకుంద దగ్గరికి రేవతి వస్తుంది. ఏంటి హ్యాపీగా ఉన్నారని ముకుంద అడుగుతుంది. నీకు ఇంట్లో జరిగింది మాత్రమే తెలుసు నాకు బయట ఏం జరుగుతుందో కూడా తెలుసు అని చెప్పిన రేవతి, నవ్వి వెళ్ళిపోతుంది. ముకుందకి ఏం అర్థం కాదు.

మరోక వైపు మధు కోసం అలేఖ్య వెయిట్ చేస్తుంటుంది. కాసేపటికి మధు వస్తాడు. కృష్ణ ఎక్కడికి వెళ్ళిందని అనగానే.. అలేఖ్య చెంప చెల్లుమనిపిస్తాడు మధు. నువ్వు ఇంకొక సారి ముకుంద తో కన్పిస్తే బాగుండదంటూ వార్నింగ్ ఇస్తాడు. మరొక వైపు మురారి దగ్గరికి కృష్ణ బయల్దేర్తుంది. రేవతి దేవుడికి మొక్కుకుంటుంది. అప్పుడే మధు వస్తాడు. కృష్ణని ప్రేమిస్తున్నట్టు మురారి లెటర్ లో రాసి చెప్పాడనే విషయం మధుకి రేవతి చెప్పగానే మధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక వైపు ప్రభాకర్ కృష్ణ కోసం వాళ్ళింటికి వస్తాడు. ముకుంద కృష్ణని గేoటేసామని చెప్పగానే.. ఎందుకు ఏం జరిగిందంటు భవానిని నిలదీస్తాడు ప్రభాకర్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.