English | Telugu
తను డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయిందంట!
Updated : Aug 4, 2023
అషు రెడ్డి.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు అషు పెద్దగా పరిచయం లేని పేరు. బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ తో పాటు తనకంటు ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఆర్జీవీతో అషురెడ్డి కలిసి చేసిన ఒక వీడియో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో ఈ వీడియో గురించి నెటిజన్ల నెగెటివ్ కామెంట్స్ తో పెద్ద డిబేటే జరిగింది. అంతేకాకుండా మరోసారి ఒక కాఫీ షాప్ లో అషురెడ్డి పొట్టి డ్రెస్ లో కూర్చొని ఉండగా.. ఆర్జీవీ తన థైస్ ని బాగున్నాయని అనగా, ఆమె చెంపమీద కొట్టడంతో ఆ ఇంటర్వ్యూ కూడా అప్పట్లో వైరల్ అయింది.
అషు రెడ్డి, కమెడియన్ పటాస్ హరితో సన్నిహితంగా ఉంటుంది. దాంతో ఇద్దరు లవ్ లో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే అందులో నిజం లేదని కేవలం ఎంటర్‌టైన్మెంట్ కోసమనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అషు రెడ్డి బిబిజోడి షో కోసం మెహబూబ్ తో కలిసి జోడి గా వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో వెళ్ళిపోయింది. అషు ప్రస్తుతం ఎక్కువగా విదేశాలలో ఉంటుంది.
అమెరికాలో అషురెడ్డి పచ్చడి మెతుకులు తింటున్నా అని పోస్ట్ చేయగా అప్పట్లో వైరల్ గా మారింది. ఆ తర్వాత అమెరికాలో తన ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళగా అందరు అషురెడ్డి ఇల్లేమో అని అనుకొని షాక్ అయ్యారు. అలా అషు రెడ్డి ఏం చేసినా ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే తాజాగా తను ' ఆస్క్ మీ క్వశ్చన్ ' స్టార్ట్ చేసింది. మీరెప్పుడు విదేశాలకు ఎందుకు వెళ్ళొస్తారని ఒకరు అడుగగా.. ఈవెంట్స్ అటెండ్ అవుతానని, తన ఫ్యామిలీ కూడా అక్కడే ఉందని అషురెడ్డి చెప్పింది. యాక్టర్ కాకుండా మీరేం కావాలనుకున్నారని ఒకరు అడుగగా.. మొదటి నుండి డాక్టర్ అవ్వాలని అనుకున్నానని అషు రెడ్డి చెప్పింది. " హౌ వాజ్ ది బ్రో స్టార్మ్ " అని ఒకరు అడుగగా.. రెండు కళ్ళు సరిపోలేదని అషు రెడ్డి రిప్లై ఇచ్చింది. ఇలా అషు రెడ్డి కొన్ని వ్యక్తిగత విషయలను షేర్ చేసుకుంది.