English | Telugu

వెంగళప్పతో ఫైమా పెళ్లి... డిప్రషన్‌లో ప్రవీణ్!


బుల్లితెర మీద పటాస్ ఫైమా, ప్రవీణ్ గురించి తెలియని వారంటూ ఎవరూ లేదు. బుల్లితెర మీద లేడీ కమెడియన్స్ హవా ఈ మధ్య కాలంలో బాగా నడుస్తోంది. జబర్దస్త్ లో బులెట్ భాస్కర్ టీమ్ లో కొంత కాలం చేసిన ఫైమా ఆ టీమ్ కి పిల్లర్ లా ఉండేది. ఆ టీమ్ బాగా హైలైట్ అవడానికి ఫైమా కూడా కారణం. అలాంటి ఫైమా తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా కంటెస్టెంట్స్ కి గట్టి పోటీనే ఇచ్చింది. తన కామెడీతో అందరినీ అలరించింది. అలాగే బీబీ జోడి డాన్స్ షోలో ఆర్జే సూర్యతో కలిసి పెర్ఫార్మ్ చేసి విన్ అయ్యింది.

ఇప్పుడు శ్రీముఖితో కలిసి ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కనిపిస్తూ ప్రతీ వారం అలరిస్తోంది. ఫైమా, ప్రవీణ్‌ ప్రేమ గురించి కూడా అందరికీ తెలుసు. పటాస్ షో నుండే వీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఫైమా కూడా చెప్పింది. వీళ్ళ మధ్య ఇప్పుడు బేబీ మూవీ చిచ్చు పెట్టింది. "ఇక నుంచి మన ప్రేమ మొదలవుతుంది" అంటూ ఫైమా చెప్పాక ఇద్దరూ కలిసి రెస్టారంట్ కి వెళ్లారు. గిఫ్ట్ తెద్దామనుకున్న నీకోసం కానీ నేనే రావడమే పెద్ద గిఫ్ట్" అని తేలేదని చెప్పాడు ప్రవీణ్. "మూవీకి వెల్దామా" అనేసరికి "బ్రో మూవీ వచ్చిందిగా పదా వెళదాం"..అని ఫైమా అంది "కాదు ముందు బేబీ మూవీకి వెళదాం ఇద్దరికీ కార్నర్ సీట్లు బుక్ చేశా" అని చెప్పాడు ప్రవీణ్. అలా మూవీకి వెళ్లి మధ్యలోనే లేచి వచ్చేసాడు ప్రవీణ్.. వెనకే ఫైమా వచ్చి ఏంటని అడిగేసరికి ఈ అమ్మాయిలను ప్రేమించడంకంటే చచ్చిపోవడం బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వాళ్ళ మధ్య బ్రేకప్ ఐనట్టు తర్వాత ఫైమాకి వేరే అబ్బాయితో పెళ్లైనట్టు పెళ్లి కార్డు కూడా చూపించారు.