English | Telugu

తినడానికే తిండి ఉండదు.. ఇంకా వాషింగ్ మెషిన్ కూడా ఉంటుందా

ఏ కొత్త మూవీ రిలీజ్ ఐనా సరే ఆ మూవీకి పబ్లిసిటీ ఇవ్వడానికి చాలా మంది సెలబ్రిటీస్ టేస్టీ తేజతో కలిసి ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఇటీవలే ఎలిమినేట్ ఐన వాసంతి కృష్ణన్ ని తేజ ఇన్వైట్ చేసాడు. ఇక ఆ ఇద్దరు కలిసి ఫుల్ గా ఫుడ్ తింటూ బిగ్ బాస్ హౌస్ కి సంబంధించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు.

"మమ్మల్ని వీకెండ్స్ లో చూసేవాళ్లంతా కూడా మాకు ఎవరైనా హెయిర్ స్టయిలిష్ట్స్ వచ్చి మేకప్ చేస్తారేమో అనుకుంటారు కానీ కాదు మాకు మేమే రకరకాలుగా హెయిర్ స్టైల్స్ వేసుకుంటాం. ఇక హౌస్ లో మా బట్టలు మేమే లోపల ఉతుక్కుంటాం. కానీ చాలామంది వాషింగ్ మెషిన్ ఉండి ఉంటుంది లోపల అనుకుంటారు. కానీ అలా ఏమీ ఉండదు. బిగ్ బాస్ హౌస్ లో తినడానికే ఫుడ్ సరిగా ఉండదు ఇంకా ఇలాంటివి ఎందుకు ఏర్పాటు చేస్తారు. హౌస్ లోకి బ్యాక్ ఎండ్ నుంచి కూడా ఎవరూ రారు. కేవలం కెమెరాలు చూసుకోడానికి వస్తారు. ఇక నాకు బాయ్ ఫ్రెండ్ అనేవాళ్ళు లేరు..నేను సింగల్. ఇంకా బిగ్ బాస్ హౌస్ లో నాకు విఐపి రూమ్ అంటే చాలా ఇష్టం. గుడ్లు అంటే కూడా నాకు చాలా ఇష్టం. కానీ అవి దొరికేవి కావు. ఎవరైనా ఎలిమినేట్ ఐనప్పుడు మాత్రమే గుడ్లు మిగిలేవి.. ఇక నాన్-వెజ్ తినాలి అంటే లగ్జరీ బడ్జెట్ లోనే దొరికేది. ఇనాయ, కీర్తి నాకు బాగా కనెక్ట్ అయ్యారు. టాప్ 5 లో రేవంత్, శ్రీహన్, ఇనాయ, ఆదిరెడ్డి, కీర్తి వీళ్ళే ఉంటారు." అని వాసంతి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది.