English | Telugu
బిగ్ బాస్ టైటిల్ రేస్ లోకి దూసుకొచ్చిన ఇనయా!
Updated : Nov 27, 2022
నిన్న మొన్నటి దాకా బిగ్ బాస్ హౌస్ లో నోటి దురుసు, వసపిట్టలాగా అరుస్తోంది అనుకున్న ఇనయా కాస్త ఇప్పుడు టైటిల్ రేస్ లోకి దూసుకొచ్చింది.
మాటకి మాట, హౌస్ మేట్స్ లో దాదాపు అందరితో గొడవ పెట్టుకుంటూ కనిపించే ఇనయా, మొదటి మూడు వారాల్లోనే బయటకొచ్చేస్తుందని అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి, కెప్టెన్ అయ్యింది. దీంతో సెమీ ఫైనల్ కి చేరుకుంది. కెప్టెన్ అయిన కారణంగా టాప్ త్రీలో ఇనయా ఉండబోతుంది.
అసలు ఏం జరిగిందంటే రెండు వారాల క్రితం హౌస్ లో జరిగిన 'ఫిజికల్ టాస్క్' లో రేవంత్ తో తలబడింది ఇనయా. ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్న రేవంత్ ని, ఇనయా ఆపడం అనేది చాలా కష్టం.. కానీ ఇనయా తనకి గట్టిపోటీ ఇచ్చింది. దీంతో ఇనయాకి ఫ్యాన్ బేస్ పెరిగింది. నెట్టింట్లో ఇనయాకి చాలా మంది మద్దతు దొరికింది. "ఒక ఆడపిల్ల పులిలా తలబడటం చూడటం ఇదే ఫస్ట్ టైం" అంటూ నెట్టింట్లో ఇనయాకి సపోర్ట్ గా ట్వీట్స్ కూడా వస్తుండటంతో ఇనయా ఈ సారి టైటిల్ గెలుస్తుందనే అనుకుంటున్నారంతా. అయితే రేవంత్ గట్టి పోటీ ఇస్తుండటంతో ఇనయా రన్నర్ గా సరిపెట్టుకుంటుందో లేక అంచనాలను దాటుకొని విన్నర్ అవుతుందో? లేదో? చూడాలి మరి.